పుట:Punitha Matha.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ పునీతురాలు సర్వశక్తిమంతుడు నా యెడల గొప్ప కార్యాలు చేశాడు అనిపలికింది -లూకా 1,49. ఈ మరియులాగే మఠకన్యగూడ “దీనురాలు". ఆమె ప్రభువు మీద ఆధారపడి జీవిస్తూండాలి. తనకు సిద్ధించే కష్టాలనూ అపార్థాలనూ వినయంతోసహిసూండాలి. మరియునుజూచి, మరియు సహాయంతో, తానూ ఈ దీనత్వాన్ని అలవరచుకోవాలి.

మరియు ఇప్పటి మఠకన్యల్లాగ మూడు ప్రతాలు చేపట్టలేదు. ఐనా ఆమె మూడు వ్రతాలను వస్తుతః పాటించింది. “నీ మాట చొప్పననే నాకు జరగాలి” అన్న వాక్యం ఆమె విధేయతకు నిదర్శనం. ప్రభువుకోసం ఆమె కన్యగా, పేదరాలుగా జీవించింది. ఈనాడు మఠ జీవితంలో ప్రధానాంశం మూడు ప్రతాలనూ పాటించడం. ఈ జీవితం చాల కష్టమైంది. ప్రత్యేకమైన దైవానుగ్రహం లేందే ఈ ప్రయత్నంలో నెగ్గలేం. ఈ ప్రతజీవితంలో మరియ మఠకన్యకు మాతృకగా వుంటుంది.

3. మరియ గృహస్టులకు ఆదర్శం

మరియు అంగీ వేసికొని మఠజీవితం జీవించలేదు. బోలెడన్ని గొడవలతో గూడిన సంసార జీవితం గడిపింది. సంసార జీవితంలో మొదటి విషయం, భార్యాభర్తలు అనురాగంతోను ఒద్దికగాను జీవిస్తూండడం. మరియా యోసేఫులు అలా జీవించారు. మరియ ఆత్మశక్తి వలన అద్భుతంగా గర్భవతి అయింది. ఈ రహస్యం మొదట యోసేఫుకి తెలియదు. కనుక అతడు ఈ సంగతంతా విని బాధపడ్డాడు గాని ఆమె పట్ల మాత్రం కటువుగా ప్రవర్తించలేదు. మరియను రద్దిజేయకుండా పరిత్యాగ పత్రికనిచ్చి రహస్యంగా విడనాడదా