పుట:Punitha Matha.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భక్తురాలు. ఆమె ప్రభువు మీదనే హృదయం లగ్నం జేసి జీవిస్తూండేది. దేవాలయానికివెళ్లి పూర్వవేద భగవంతుణ్ణి సేవించుకొంటూండేది. పరిశుద్ధాత్మవలన అంతరంగంలో ప్రబోధం చెందుతూండేది. పూర్వవేదం చదువుకొని ప్రభు ధర్మశాస్త్రం ధ్యానించు కొంటూండేది. మరియ మననమూర్తి, ధ్యానశీల. "ఆమె యీ విషయాలన్నీ మనసులో తలపోసికొంటూండేది"అన్న లూకా వాక్యమే ఇందుకు తార్కాణం - 2,52. ఆ భక్తురాలు క్రైస్తవ గృహిణులకు కుటుంబ భక్తిని నేర్పుతుంది. హృదయం భగవంతునిమీద లగ్నం చేసికోవడమూ ప్రభు గ్రంథాన్ని పఠించి ధ్యానం చేసికోవడమూ అనే భాగ్యాలను సంపాదించి పెడుతుంది.

యూద సమాజంలో మగవాళ్లకు మాత్రమే ప్రాధాన్యముండేది. అలాంటి సమాజంలో ఆడవాళ్లు తరచుగా బాధలకూ చిక్కులకూ అపార్థాలకూ గురౌతుండేవాళ్లు మరియకు కూడ ఈ దుర్గతి తప్పలేదు. యోసేపు గర్భవతియైన మరియను శంకింపగా అతడు తనపట్ల ఎంతమృదువుగా ప్రవర్తించినా గాని ఆమెకు కొండంత బాధ కలిగివుండాలి గదా? మన భారతీయ సమాజం కూడ యూద సమాజంలాగే స్త్రీకి విలువనీయని సమాజం. ఈ సమాజంలో స్త్రీకి జరిగే అన్యాయాలూ అపచారాలూ అన్నీ యిన్నీ కావు. మన దేశంలో ఆడవాళ్లు కన్నీరుగార్చని యిండ్లు అరుదంటే అతిశయోక్తి కాదేమో. ఈలాంటి పరిస్థితుల్లో మరియు క్రైస్తవ పురుషుల కంటె గూడ క్రైస్తవ ప్రీకి ఎక్కువ ఆదర్శంగా వుంటుంది. ఆమె పురుషుడు కాదు. ప్రీ. ఆ మాతృమూర్తి ప్రీ హృదయంతో తన కొమార్తెల మానసిక బాధలను