పుట:Punitha Matha.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తుని తాను పొందేలా, అటు తరువాత తాను పొందిన క్రీస్తుని విశ్వాసులకు అందించేలా తోడ్పడుతుంది మరియ.

2. మరియ మఠకన్యలకు ఆదర్శం

నరుడు నిర్దోషంగాను పవిత్రంగాను జీవించాలని భగవంతుని కోరిక. ప్రభువు కోరుకొన్నట్లుగా నిర్మలజీవితం జీవించిన పునీతురాలు మరియ. ఆమె యేనాడూ పాపపు బురదలో అడుగు పెట్టలేదు. మానవ మాత్రుల్లో యింత నిర్మలంగా జీవించిన వ్యక్తి మరెవ్వరూ లేరు. అందుచేత మరియు ప్రభువుకి సర్వవిధాలా ప్రియపడింది. ఇక, మఠకన్యగూడ శరీరాన్ని హృదయాన్నీ ప్రభువుకే అంకితం జేసికొని ప్రభు సంబంధమైన కార్యాల్లో నిమగ్నం కావాలి -1కొ 7, 34.పవిత్ర జీవితం గడపాలి. ఈలా నిర్మల జీవితం జీవించడంలో నిర్మల మాతయైన మరియు ఆమెకు తోడ్పడుతుంది. మరియు కేవలం మనకు ఆదర్శమూర్తి మాత్రమేగాదు, ఓ సజీవవ్యక్తి గూడ. కనుక ఆమె తన బిడ్డలమైన మనకు వరప్రసాదాలను ఆర్జించి పెడుతూ అన్నివిధాలా సాయపడుతూంటుంది.

పూర్వవేదకాలంలో "హనవిం” లేక "దీనులు" అనే భక్తులు ఉండేవాళ్లు. వాళ్లు ప్రభువుమీద ఆధారపడి జీవిస్తూండేవాళ్లు. తరచుగా పేద జీవితం జీవిస్తూండేవాళ్లు, బాధలకు గురౌతుండేవాళ్లు గూడ. నూతవేదంలో మరియ ఈ దీనుల కోవకు చెందిన భక్తురాలు. అందుకే ఆమె మహిమ గీతికలో "ప్రభువు నా దీనత్వాన్ని కటాక్షించాడు. " అని చెప్పుకొంది -లూకా 1,48. తాను పూర్తిగా ఆ ప్రభువు మీద ఆధారపడి జీవించింది. ఈమె గొప్పతనమంతా ప్రభువు పెట్టిన భిక్ష కావుననే GD