పుట:Punitha Matha.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గొర్రెపిల్లను బలికి సిద్ధం జేసినట్లుగా మరియు క్రీస్తుని సిలువ యాగానికి సిద్ధం జేసింది. కడన ఆ బలిమూర్తిని కల్వరికొండమీద తండ్రికి సమర్పించింది. అంతమాత్రమే గాదు, క్రీస్తుతోపాటు తాను బలిమూర్తి అయింది. క్రీస్తుతోపాటు తన్ను తాను పరలోక పితకు సమర్పణం చేసికొంది. ఈ సమర్పణ కార్యంలో ఆమె గురువుకి తోడ్పడుతుంది. ఆమె గురువు హృదయంలో భక్తిభావాలు పుట్టించి అతడు యోగ్యంగా తన్ను తాను దేవునికి నివేదించుకొనేలా చేస్తుంది.

క్రీస్తు జననానికిగాను మరియు భక్తిభావంతో తయారైంది. ఆ ప్రభుని ఆమె మనసార నమ్మింది. అందుకే ఎలిసబేత్తు కూడ "ప్రభువు పలుకులు విశ్వసించిన నీవు చాల ధన్యురాలవు" అని మరియను పొగడింది. గురువుకూడ పీఠంమీద క్రీస్తు జన్మించేలా చేసేవాడు. అంచేత అతనికి గూడ మరియకున్న విశ్వాసమూ భక్తి వుండాలి. మరియు తన వేడుకోలు ద్వారా గురువు విశ్వాసుల హృదయాల్లో క్రీస్తుని పుట్టించేలా చేస్తుంది.

మరియు గొప్ప ప్రేషితురాలు. ఆమె పన్నెండు మంది ప్రేషితుల్లో ఒకతెగాదు. కాని ఆమె వస్తుతః ప్రేషితురాలు. ప్రేషితుల రాజ్జికూడ. ఆమె సాధించిన గొప్ప ప్రేషిత కార్యం లోకానికి క్రీస్తుశ్యోతిని ప్రసాదించడం. అనగా క్రీస్తుని కనడం. తాను కన్న క్రీస్తుని ఆ విశ్వజనని రకరకాల రూపాల్లో ఆనాటి ప్రజలకు అందించింది. ఈనాడు కూడ ఆ విజ్ఞాపన మాత మోక్షం నుండి విశ్వాసుల కోసం ప్రార్ధనచేస్తూ వాళ్లకు క్రీస్తుని అందిస్తూనే వుంటుంది. ఇక, గురువుకూడ మరియలాగే క్రీస్తుని విశ్వాసులకు అందించేవాడు. గురువు మొదట டு