పుట:Punitha Matha.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జపమాల, దేవమాత ఆఫీసు, దేవమాత కీర్తనలు మొదలైనవి భక్తిరసభరితమైన ప్రార్థనలు.

పై జపాల్లో రెండు చాల ముఖ్యమైనవి. అవిమరియనామం, జపమాల, మరియనామం పవిత్రనామం. ఆ నామం తన్నుచ్చరించే వాళ్లను పవిత్రపరుస్తుంది. పిశాచాన్ని పారద్రోలి రక్షణను సంపాదించి పెడుతుంది. దేవమాత ప్రార్థనలన్నిటిలో జపమాల శ్రేష్టమైంది. క్రీస్తు మరియల జీవిత ఘట్టాలను ధ్యానం జేసికొంటూ జపమాలను చెప్పి నట్లయితే చాలా ఫలితం పొందవచ్చు.


క్రీస్తు సాన్నిధ్యంలాగే మరియ సాన్నిధ్యం అనేది కూడ ఒకటుంది. భక్తులు చాలమంది ఆ తల్లి సాన్నిధ్యాన్ని స్మరించుకొన్నారు. ఆమె వాళ్ల విశ్వాస నేత్రాలకు ప్రత్యక్షమౌతుంటుంది. వాళ్లను తన పచ్చడం క్రింద కాచికాపాడుతూంటుంది. రోజురోజు మరియు మనకు చేసే సహాయమే, మనకిచ్చే రక్షణమే ఆమె సాన్నిధ్యానికి నిదర్శనం. కనుక మరియు తాను జీవించినపుడు ఆనాటి స్త్రీ పురుషులతో ఏలా తిరుగాడిందో ఈనాడు తన భక్తులతోను అలా తిరుగుగాడుతూంటుంది. ఆ పునీత హృదయ సాన్నిధ్యాన్ని మననం చేసికొంటూ పాపాన్ని జయించవచ్చు. దివ్యజీవితం గడపవచ్చు.

మరియకు అంకితమైన గుళ్లకు వెళ్లి ఆమెను కొనియాడ్డంకూడ ఓ భక్తిమార్గం. ఆ తల్లి పేర ప్రదక్షిణలు జరుపవచ్చు. ఆమె దర్శనమిచ్చిన పుణ్యక్షేత్రాలు దర్శించవచ్చు. స్మరించవచ్చు. ఈ సందర్భములో విశేషంగా లూరు మాత గుహను పేర్కొనాలి. ఫ్రాన్సు నందలి లూరునగర గుహను సందర్శించలేకపోయినా, మన వూళ్లలో