పుట:Punitha Matha.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నమూనాగా కట్టుకొనే లూరు గుహ యెదుట భక్తిని ప్రదర్శించవచ్చు. మన వూరి గుహ యెదుటనే నిలుచుండి ఆనాడు మరియు బెర్మదత్తుకిచ్చిన దర్శనాన్నిస్మరించుకొని మన పాపాలకు పశ్చాత్తాపపడి, మన అవసరాలను ఆ తల్లికి విన్నవించుకోవచ్చు.


మరియమాతను గూర్చిన బైబులు వాక్యాలను చదువుకొని మననం జేసికొంటూ ప్రార్ధించుకోవడం గూడ ఓ చక్కని భక్తిమార్గం. మరియు తాను స్వయంగా మననశీల - లూక 2,18. సువిశేషకారులు ఆమెను పరమ పవిత్రమూర్తినిగా చిత్రించారు. మరియను ప్రస్తావించే సువిశేష వాక్యాలను ధ్యానించుకొనేవాళ్ల హృదయం అనతి కాలంలోనే భక్తిభావంతో నిండిపోతుంది.


మంచిమరణం దయచేయమని గూడ మనం ఆ తల్లిని వేడు కొంటూండాలి. ఆమె మన రక్షణాన్ని కోరుకొంటుంది. కనుక ఈ భాగ్యాన్ని తప్పక ప్రసాదిస్తుంది. మంగళవార్తజపం రెండవభాగంలో శ్రీసభ ఈ మనవిని చేర్చింది. వేదశాస్త్రజ్ఞలు చాలామంది "మరియమాత భక్తులు నరకానికి పోరు, తప్పకుండ రక్షణం పొందుతారు” అని నుడివారు. అల్ఫోన్సస్ లిగొరి అనే భక్తుడు తాను వ్రాసిన మరియమాత మహిమలు అనే ఉద్దంథాన్ని "మరియమాత భక్తులకు చేటులేదు" అంటూ ముగించాడు. ఈలాంటే మనం పాప జీవితం జీవించినా మరియు మనలను అద్భుతంగా మోక్షానికి తీసికొని వెళ్తుందని భావంగాదు. ఆమె తన భక్తులు పాపపు బురదలో అడుగు పెట్టకుండా వుండేలా తోడ్పడుతుంది. ఒకవేళ బలహీనతవల్ల పాపంలో కూలిపోయినటైతే వాళ్లకు పశ్చాత్తాపం