పుట:Punitha Matha.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆమె ద్వారా మన చెంతకు వచ్చాడు. మనమూ ఆమె ద్వారాగాని తన్ను జేరలేమని నేర్పాడు. అంచేత మనం ఆ తల్లి పట్ల భక్తి చూపుతూండాలి.

క్రైస్తవ ప్రజలు మరియమాతపట్ల చూపే భక్తి క్రియలు చాలా వున్నాయి. ఆమె పండుగలు చేసికొనవచ్చు. నిష్కళంకోద్భవమూ, ఉత్థాపనమూ ఈ పండుగల్లో ముఖ్యమైనవి. శనివారాలను భక్తిపూర్వకంగా ఆమెకు సమర్పించవచ్చు.

మనలనూ మన రోజువారి పనులనూ ఆ తల్లికీ ఆమె ద్వారా క్రీస్తుకీ అర్పించుకోవచ్చు. పాపం కట్టుకోకుండా వుండేలా సాయపడమని ఆ తల్లిని అడుగుకోవచ్చు.

మరియమాత ఉత్తరీయం ఒకటుంది. 1251 లో ఆమె సైమన్ స్టోక్ అనే ఆంగ్ల భక్తునికి దర్శనమిచ్చి తన ఉత్తరీయాన్ని ధరించేవాళ్లు నరకానికి పోరని మాటయిచ్చింది. ఈ యుత్తరీయంతోపాటు ఆమె స్వరూపాలు ధరించడమూ, ఆమె చిత్రాలూ ప్రతిమలూ ఇండ్లలో పెట్టుకొని పూజించడమూ సనాతన క్రైస్తవాచారం. మరియమాత ప్రతిమకు చూపిన గౌరవం ఆ బొమ్మకు గాదు, మరియకు చెందుతుంది. గతించి పోయిన మన తాతగారి ఫొటోకు చూపిన గౌరవం ఆయనకే చెందుతుంది గదా!

మరియను గౌరవించే సభలు కొన్ని వున్నాయి. సౌడాలిటీ, లీజను వీటిల్లో ముఖ్యమైనవి. ఈ సభల్లో చేరి ఆ తల్లిని నుతించవచ్చు. మరియమాత పేర చెప్పే జపాలూ చాలావున్నాయి. మరియు నామం, దేవవరప్రాద జపం, త్రికాల జపం, నవీనా జపాలూ, దేవమాత ప్రార్ధన, కృపారస మంత్రం, ఫ్రీ నెనరుగల తల్లి అనే జపం,