పుట:Punitha Matha.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యేసుకి 30 ఏండ్లు మరియు 50 ఏండ్ల వితంతువు. కానాపూరి వివాహంలో ఆమె కుమారునడిగి బంధువులకు ద్రాక్షరసం సరఫరా చేయించింది. కొందరు నరులు క్రీస్తుకి ఎడబాయని అనుచరులయ్యారు. కొన్నిసార్లు ఆమె కూడ కుమారుని అనుసరించింది. యెరూషలేములోని రాజకీయ నాయకులు మతాధికారులు మాత్రం క్రీస్తును తీవ్రంగా ఎదిరిస్తున్నారు. మరియు భయపడింది. రాజకీయ ప్రాబల్యానికి వెరచింది. అధికారుల బలానికి దడిసింది. ఆమె మన మనుకొన్నట్లుగా కేవలం కోమల హృదయ, మృదుస్వభావ, మననశీల మాత్రమే కాదు. ధీరవనిత. ఆనాటి రాజకీయాల్లో ఆమెకు ప్రవేశముంది. వాటి తాకిడికి గురైంది కూడ.

8. క్రీస్తుకి తీర్పు

మరియు క్రీస్తుకి జరిగిన తీర్పును, అతడనుభవించిన హింసలనూ కండ్గార చూచి వుంటుంది. సిలువ మార్గంలో ఆమె కుమారునికి ఎదురు పడింది. శిష్యులు ప్రభువును విడచి పారిపోయినా ఆమె అలా చేయలేదు.

9.సిలువ క్రింద

క్రీస్తు చనిపోయేపుడు మరియ సిలువ క్రింద నిలచివుంది. కుమారుని శ్రమలు కండ్లారా చూస్తూగూడ అతనికి సహాయం చేయలేక దుఃఖించింది. విశేషంగా తన కుమారుడు అపజయం పొంది మరణించినందులకు ఎంతో బాధపడింది. ఐనా ఆమె వేదనలు మానసికమైనవే గాని శారీరకమైనవి కావు. శత్రువులు ఆమెను ఎగతాళి చేసి యేడ్పించి వుంటారు. ఆమె నిబ్బరంగా సహించి ఊరకుంది.