పుట:Punitha Matha.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిరపరాధులైన శిశువులను మట్టుపెట్టించాడు. బలవంతులు దుర్బలులైన పేదలకు చేసే అన్యాయాలకు మరియ పరితపించి కన్నీరు కార్చింది.

6. దేవాలయ సందర్శనం :

క్రీస్తుకు 12 ఏండ్ల యీడొచ్చినపుడు మరియా యోసేఫులు యెరుషలేము పాస్మోత్సవానికి వెళ్లారు. ఆ సమయంలో క్రీస్తు బాలుడు నేనుతండ్రి పనిలో నిమగుణ్ణి కావద్దా అన్నాడు. ఆ మాటలు తల్లికి అర్థం కాలేదు. ఆమెకు క్రీస్తు భవిష్యత్తును గూర్చి స్పష్టంగా తెలియదు. దేవుని మీద భారంవేసి తనకు అంతుబట్టని సంగతులను విశ్వాసంతో నమ్ముతూ వచ్చింది. చీకటిలో తడవుకొంటూ నడచింది. ఈ సంఘటనం తర్వాత కొన్నాళ్లకు యోసేపు చనిపోయి వుండాలి. ఇక కుటుంబం ఆలనాపాలనా అంతా ఆమె నెత్తిన పడింది. కనుక మరియను పవిత్ర కన్యనుగా కంటె కాయకష్టం చేసికొని బ్రతికిన గృహిణినిగా గణించడం మెరుగు.

7. క్రీస్తు బహిరంగ జీవితం :

ప్రభువు తల్లిని వీడి బహిరంగ జీవితం ప్రారంభించాడు. యెరూషలేములోని మతాధికారులు క్రీస్తుకువ్యతిరేకులయ్యారు. అతడు కూడ యూదుల విశ్రాంతి దినం, ధర్మశాస్ర నియమాలు మొదలైన వాటిని నిరసిస్తున్నాడు. పేదలు సుంకరులు మొదలైన అట్టడుగువర్గం వాళ్ల కోపు తీసికొంటున్నాడు. మరియ కలత చెందింది. కుమారుని భావాలు ఆలోచనలు ఆమెకు సరిగా అర్థంకాలేదు. ఐనా విశ్వాసంతో దేవుణ్ణి నమ్మింది. క్రీస్తు ఆదరించే పేదల పట్ల తానూ ఇష్టం పెంచుకొంది.