పుట:Punitha Matha.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీసు ఆమెను యోహానుకి తల్లిగాను, యోహానుని ఆమెకు కుమారునిగాను అర్పించాడు. కుమారుని మరణానంతరం ఆమె వయసుమళ్లిన మహిళగా కొన్నియేండ్లపాటు జీవించి వుంటుంది.

10. చివరిదాకా విశ్వాసాన్ని నిల్పుకొంది

శిష్యులు పారిపోయినా మరియు క్రీస్తును విడచి పారిపోలేదు. కుమారుని మరణం వరకు అతనికి అంటిపెట్టుకొని వుంది. క్రీస్తు చర్యలు తనకు అర్ధం గాకపోయినా అతన్ని విశ్వసిస్తూ వచ్చింది. క్రీస్తు దాటిపోయిన తర్వాత అతని వుద్యమాన్ని బలపరిచింది. శిష్యులకు తల్లియై క్రీస్తులేని లోటు తీర్చింది. తన పాలబడిన బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వహించింది. క్రీస్తు జీవితకాలమంతా అతనిపట్ల, క్రీస్తు మరణానంతరం అతని అనుచరుల పట్లను అంకిత భావంతో మెలిగింది.

11. ఉత్థాపితమాతయైన మరియ ఈనాడు మనకు స్ఫూర్తినిస్తుంది

క్రీస్తులాగే మరియకూడ నరుల దేహాత్మల పరిపూర్ణ విమోచనం కొరకు కృషి చేసింది. మరియను జూచి నేటి మన స్త్రీలు కూడ పరిపూర్ణ విమోచనం కొరకు కంకణం కట్టుకోవాలి. మన దేశంలో, ప్రపంచ మంతటా గూడాను, స్త్రీలకు ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. మహిళలు మరియ నుండి ప్రేరణం పొంది ఈ యన్యాయాలను ధైర్యంతో ఎదిరించాలి. వాళ్లు వట్టినే పుణ్యక్షేత్రాలకు వెళ్లి ఆమెకు ప్రార్థనలు చేస్తేనే చాలదు.

చాలమంది సిస్టర్లు వాళ్ల పేరుకి ముందు మరియు పేరు గూడ చేర్చుకొంటారు. మంచిదే. కాని సిస్టర్లు మరియలాగ బాధ్యతయుతంగా మెలగాలి. దుష్టశక్తులనుండి ལེགས་ རྙིང་མའི་རིང་ తోడి ప్రీ జాతినీ కూడ