పుట:Punitha Matha.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వరప్రసాదాలను పంచి పెట్టడంలోగూడ తోడ్పడుతుంది. రక్షణంలో ఆమె తోడ్పాటు అవసరమై కాదు. ఔచిత్యం కోసం అన్నాం. వరప్రసాదాలను పంచిపెట్టడంలో గూడ ఆమెతోడ్పాటు అవసరమై కాదు, ఔచిత్యం కోసం మాత్రమే.

పునీతులు మనకుఏదో వో ప్రత్యేక వరప్రసాదాన్ని ఆర్జించి పెట్టగలరు. కాని అన్ని వరప్రసాదాలను ఆర్జించి పెట్టలేరు. మరియు మనకు ఏ వరప్రసాదాన్నైనా సంపాదిచి పెట్టగలదు. అన్ని వరప్రసాదాలూ ఆమెద్వారా గాని లభించవు. కనుక పునీతులు కూడ ఆమె ద్వారా గాని మనకు ఆయా వరప్రసాదాలను ఆర్జించిపెట్టలేరు. వేయేల క్రీస్తు వరప్రసాదం మరియ చేతుల మీదుగా గాని నరులకు చేరదు.

మన అక్కరలు ఆ తల్లికి బాగాతెలుసు. ఆమెకు మనకు సహాయం చేయాలనే కోరికా వుంది, శక్తీ వుంది. అంచేత మన తరఫున మనవి చేసి తీరుతుంది. ఈ మనవి కూడ మన రక్షణానికి వ్యతిరేకంగా వుండదు. అంచేత ప్రభువు ఆమె కోరికను తప్పక తీరుస్తాడు. వెంటనే తీరుస్తాడు కూడ.

మంచితల్లి బాధ్యత బిడ్డలను కనడంతోనే తీరిపోతుందా? తాను ఆ బిడ్డలను పోషించాలి గదా? తొలియేవ మనలను మరణానికి కంటే యీ రెండవయేవ జీవనానికి కంది. అనగా మరియ మనలను జ్ఞాన జీవితానికి ప్రసవించింది. ఈలా పుట్టిన బిడ్డలమైన మనలను ఆ తల్లి తన వరప్రసాదాలతో పోషిస్తుంది.కావున ఆ తల్లిమీద మనకు ఎంతైన నమ్మకముండాలి. బిడ్డ తల్లి పట్లలాగ, పనికత్తె యజమానురాలి పట్ల లాగ, మనమూ మరియమాత పట్ల నమ్మికతో జీవిస్తుండాలి.