పుట:Punitha Matha.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్ణహృదయంతో ప్రేమిస్తూ, దివ్య మాతృత్వానికి తన్ను తాను తయారు చేసుకుంది. భక్తుడు అగస్టీను నుడివినట్లు "మరియ దేవుని గర్భంలో ధరించకముందే హృదయంలో ధరించింది.” అనగా ఆమె భగవద్ధృదయ, సద్భగవద్భక్తురాలు.

ఆ తల్లి మనవిని క్రీస్తు త్రోసివేయడు. ఆమె పాపాత్ముల కోసం నిత్యం మనవి చేస్తుంది. విశ్వాసులందరికోసం ప్రభుని వేడుకుంటుంది. ఆమెకు మనకు సహాయం చేయాలనే కోరికా వుంటుంది. శక్తీ వుంటుంది. కనుక తాను సహాయం చేసితీరుతుంది.

మరియు దేవునికి మాత్రమేగాదు, విశ్వాసులకు గూడ తల్లి అన్నాం. క్రీస్తుకు భౌతికంగాను మనకు జ్ఞానరీత్యాను తల్లి అన్నాం. భౌతికంగా ఆ బిడ్డను చనుబాలతో పెంచి పెద్దజేసింది. జ్ఞానరీత్యా మనలను వర ప్రసాదాలతో పెంచి పెద్దజేస్తుంది. ఈ వర ప్రసాదాలను మన తరఫున క్రీస్తు నుండి అడిగి పెడుతుంది.

పరలోకపిత మరియను కలిగించింది కేవలం క్రీస్తుకు తల్లిగా వుండడం కోసం మాత్రమే గాదు. దేవదూతలకు రాజ్జిగా వుండడం కోసం గూడ. పిశాచాలను జయించడం కోసం గూడ. నరులకు సహాయం చేయడం కోసం గూడ. కనుక ఆ తల్లి మనకు అనుగ్రహాలు ఎన్నైనా ఆర్జించి పెడుతుంది. మేళ్లు ఎన్శైనా చేకూర్చి పెడుతుంది.

4. పునీతమాత పట్ల భక్తి భావాలు

పతనమైన మానవుణ్ణి భగవంతుడు స్వయంగానే రక్షించి వుండవచ్చు. కాని ఆలా చేయడం నరుని స్వాతంత్ర్యానికి, గౌరవానికి భంగం కలిగించినట్లే ఔతుంది. నరుణ్ణి నరుడే రక్షించుకొంటే అతని