పుట:Punitha Matha.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాచీన క్రైస్తవ రచయితలు మరియమాతను తొలి తల్లి ఏవతో పోల్చారు. ఏవ దుష్టదూత మాటవిని తినవద్దన్న పండు తిని అవిధేయత చూపింది. రెండవ యేవయైన మరియు దేవదూత మాటవిని విధేయత చూపింది. ఆమె చెడ్డ దూత మాటవిని మోసపోయింది. ఈమె మంచిదూత పలుకు ఆలించి, ఆ చెడ్డదూతను ఓడించింది. ఆ తొలితల్లి తన తెలివితక్కువతనం వల్ల మనకు చావు తెచ్చిపెట్టింది. మన మెడకు ఉరిపెట్టి పోయింది. కావున ఆమె మృతులమాత. కాని యీ రెండవతల్లి తన వివేకం వల్ల మనకు జీవం సంపాదించి పెట్టింది. మనమెడకు తగులుకొనిన ఉరిని తొలగించింది. కావున ఈమె జీవవంతులమాత. ఆ తల్లి కంటె యీ తల్లి యోగ్యురాలు. ఆ తల్లి పాపానికి ఈ తల్లి ప్రాయశ్చిత్తం కూడ చేసింది. ఆ తల్లి తరఫున ఈ తల్లి ప్రభువునకు విన్నపం చేసింది.

3. మాతృత్వపు మహిమలు

మరియు దేవుని తల్లి అన్నాం. దేవమాత గావడమంటే సామాన్య భాగ్యం కాదు. సృష్టి ప్రాణికి ఇక యింతకంటె గొప్ప భాగ్యమూ, మహిమా లేనేలేదు. దేవుని తరువాత దేవుడంతటి వ్యక్తి మరియు. ఆమెకు దేవుని కంటె తక్కువ స్థానం. కాని పునీతులకంటె, దేవదూతల కంటె కూడ యొక్కువ స్థానం. అనగా దేవునికి చాలా దగ్గరస్థానం. ఆ కుమారుడెంత యోగ్యుడో ఆ తల్లీ అంత యోగ్యురాలు. అందుకే దేవమాత ప్రార్ధనలోని బిరుదులన్నిటి కంటె “సర్వేశ్వరుని మాత" అనేది చాల గొప్పబిరుదం. ఈ భాగ్యం వలననే సమస్తజాతి జనులూ ఆమెను ధన్యురాలని మెచ్చుకుంటారు -లూకా 1,48. ఈ భాగ్యం దేవుడే ఆమెకిచ్చిన వరం. కాని ఈ వరంతో ఆమె సహకరించింది. దేవుని