పుట:Punitha Matha.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వాతంత్ర్యానికి తగినట్లుగా వుంటుంది. అందుకే దేవుడు నరుడై జన్మించాడు. నరుదైన దేవునినుండే నరునకి రక్షణ కలిగింది. విరిగిపోయిన పూలమొక్క దాన్నదే బాగుచేసికొని మళ్లాపూలు పూచింది. కాని ఈ దేవుణ్ణి నరకుటుంబములో ప్రవేశపెట్టి నరుల రక్షణం నరకుటుంబం నుండే వచ్చేలా చేసింది మరియ. ఆమె వలన దేవుణ్ణి మన మానవుణ్ణి చేసికున్నాం. మనలను మనమే రక్షించుకున్నాం. మనమర్యాద కాపాడుకున్నాం. అలాంటి తల్లికి మనం చేతులెత్తి జోహారులర్పించాలి. ఆమెను వేనోళ్ల పొగడి కొనియాడాలి.

జంతువులు పిల్లలను గంటాయి. నరులూ బిడ్డలను కంటారు. జంతువులుకేవలం వాటి పిల్లల దేహపోషణం కొరకు చనుజేపి పాలిచ్చి పోషిస్తాయి. ఆ పిల్లలు పెద్దయ్యాక వాటినిక పట్టించుకోవు. కాని నరులు అలా కాదు. మానవ మాతాపితలు తమ బిడ్డలను వ్యక్తుల్లాగ ఆదరిస్తారు. శాశ్వతంగా ప్రేమిస్తారు. మరియకూడ ఈలాగే. ఆమె మెస్సియాకు తల్లి కావడానికి ప్రేమభావంతో అంగీకరించింది. మెస్సీయా శిశువును కంది. ఆ కుమారుణ్ణి గాఢంగా ప్రేమించింది. కాని యీ కుమారుడు మన తల్లులంతా కనే కుమారుల్లాంటివాడు కాడు. భగవంతుడు కూడ. కనుక మరియ ఈ కుమారుణ్ణి ఎంతగా ప్రేమించేదో అంతగా ఆరాధించేది కూడ. ఆమె ప్రేమే ఆరాధన. మనం క్రీస్తుని “నా దేవా! నా ప్రభూ!” అంటాం. కాని ఆమె "నా కుమారా! నా దేవా!" అనుకునేది. ఈలాంటి తల్లి మరియు ఒకర్లే. కనుక ఆమెను ఎంతైనా స్తుతించాలి.

క్రీస్తు రక్షకుడు, మనం రక్షింపబడిన వాళ్లం. ఈ రక్షణం ద్వారానే