పుట:Punitha Matha.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంపూర్ణంగా నెరవేరాయి. ఈ తల్లి మనంకూడ దేవునికి పోలికగా మెలగాలని కోరుకొంటుంది. అనగా, మన తలపులు, పలుకులు చేతలు దివ్యలకు తగినట్లుగా వుండాలని వాంఛిస్తుంటుంది. తన వేడుదల వలన ఈ భాగ్యాన్ని మనకు సంపాదించి పెడుతుంది కూడ.

మరియ పరమపవిత్రురాలు అన్నాం. మనం పతిత మానవులం. అయినా ఆమె మనలను అసహ్యించుకోదు. మనతో సంబంధం తైంచి వేసుకోవాలి అనుకోదు. ఆ విమలమూర్తి మన నరజాతికి చెందిన ప్రీ. తన బిడ్డలమైన మనం కూడ వైమల్యంతో జీవించాలనే ఆమెకోరిక. అంచేత ఆమె మనలను పవిత్రమూర్తియైన భగవంతుని దాపులోనికి తీసుకొని వస్తుంది. తాను క్రీస్తుసాన్నిధ్యంవలన ధన్యురాలు ఐంది. అలాగే మనమా క్రీస్తు సాక్షాత్కారం పొంది, దైవత్వాన్ని చేకొని దివ్యజీవితం గడిపేలా చేస్తుంది.


మరియు మాతృమూర్తి. ఆ విశ్వజనని క్రీస్తు బాలుని లాగే మనలను తన గర్భంలో ఇముడ్చుకుంటుంది. ఆ దైవ శిశువును లాగే మనలనూ గారాబంతో సాకుతుంది. పెంచి పెద్దచేస్తుంది. మన అక్కరలు బాగోగులు ఆ తల్లికి తెలియనివి కావు. ఆ విశుద్ధమూర్తి మనకోసం నిత్యమూ ప్రార్ధిస్తుంటుంది. మనంకూడ వినిర్మల జీవితం జీవించి తన రూపురేఖలు అలవరచుకునేలా చేస్తుంది. ఆ పునీతమాతకు బిడ్డలం కావడం మన భాగ్యవిశేషం.


2.కస్యమాత

నాల్గవ శతాబ్దపు భక్తుడు గ్రెగొరి నీస్సా మరియను ప్రశంసిస్తూ “మెూపే కొండవద్ద చూచినపాద కాలుతూ కూడ భస్మం కాలేదు. మరియు దైవతేజస్సును గర్భంలో ధరించినా క్రూడా కన్యత్వం కోల్పోలేదు. ఆ