పుట:Punitha Matha.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తేజస్సే ఆ పొదను కాపాడింది” అని వ్రాశాడు. ప్రాచీన కాలం నుండి వస్తున్న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం మరియ నిత్యకన్య ఇక్కడ కన్యమాతను గూర్చి ఆరంశాలు విచారిద్దాం :

1. మరియ కన్యమాత అంటే ఏమిటి?

ఆ పవిత్ర హృదయ బిడ్డను కనుకముందు, కన్న తరువాత కూడ కన్యగానే వుండిపోయింది. అందుచే క్రైస్తవ ప్రపంచం ఆమెను “ధన్యురాలైన నిత్యకన్య" అని కొనియాడుతూంటుంది. దేవదూత "నీవు గర్భం ధరించి బిడ్డను కంటావు" అని చెప్పగానే మరియు "నేను పురుషుని యెరుగను గదా, ఇదెలా జరుగుతుంది?" అని అడుగుతుంది - లూకా 1,34. దేవదూత "నీవు పురుషుని వలన గాక పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భవతి వౌతావు" అని చెప్తాడు. మరియు తన అంగీకారాన్ని సూచిస్తూ "ఇదిగో ప్రభువు దాసురాలను. నీ మాట చొప్పననే నాకు జరగాలి" అంటుంది. ఆ విధంగా ఆమె తన కన్యత్వానికి భంగం కలగకుండానే బిడ్డను కంది. అంతకు ఎన్మిదివందల ఏండ్లకు పూర్వమే ప్రవక్త యెషయా "కన్య గర్భవతియై బిడ్డను కంటుంది, ఆ బిడ్డకు ఇమ్మానువేలు అని పేరు పెడతారు" అని ప్రవచనం చెప్పాడు –7, 14. చారిత్రకంగా యూ ప్రవచనం ఆహాసురాజు భార్య కనిన హిస్కియా ప్రభువునకు వర్తించినా, ప్రవక్తకుకూడ తెలియరాని అధికార్ధం వలన కన్యమరియకు కూడ వర్తిస్తుంది. అందుకే సువిశేషకారుడు మత్తయి ఈ ప్రవచనాన్ని మరియు పరంగా ఉదాహరించాడు -1.23. పై బైబులు సందర్భాలు రెండూ మరియబిడ్డను కనకముందు కన్యగా వుందని సూచిస్తాయి. బిడ్డను కన్న తరువాత? ఆమె