పుట:Punitha Matha.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పవిత్రురాలైన మరియ నేడు పవిత్రుడైన భగవంతుని సన్నిధిలో వుంది. మన యిల్లుకూడ అక్కడే గాని యిక్కడకాదు. అంచేత మరియు మనం దృష్టిని ఆ వైపునకు మరల్చాలని ప్రబోధిస్తుంది. మనం ఆ దేవుని కోసం కలిగించబడ్డామని హెచ్చరిస్తుంటుంది. అటువైపు పయనించమని మనకు సంజ్ఞ చేస్తుంటుంది.

ఆ తల్లికి పాపమాలిన్యం సోకలేదు. పవిత్రుదైన భగవంతుని తల్లి ఎంత పవిత్రరాలుగా వుండాలో అంత పావిత్ర్యంతో అలరారింది. దేవుడు మనలను కూడ పవిత్ర జీవితం జీవించడానికే కలిగించాడు. అంచేత మరియు మనలను నిర్దోషంగా నిష్కల్మషంగా జీవించమని ఆదేశిస్తుంది. దేవుని సన్నిధిలో నడుస్తూ ఉత్తమ జీవితం గడపాలని సూచిస్తుంది.

మరియు పాపాన్ని జయించి మోక్షాన్ని సాధించింది స్వీయశక్తివల్ల కాదు, దైవశక్తివల్ల కనుక ఆమె మనం కూడ దైవబలంతో దివ్యజీవితం జీవించి మోక్షంలో అడుగుపెట్టాలని చెప్తుంది. ప్రభువుమీద భారంవేసి జీవించాలని బోధిస్తుంది.

5. నిష్కళంకమాతపట్ల భక్తిభావాలు

నిష్కళంక మరియును మనం చక్కగా ధ్యానించుకోవాలి. భగవంతుడు నరుణ్ణి తనకు పోలికగా చేశాడు. ఆ దేవుళ్లాగే నరుడుకూడ దివ్యుడు. కాని తొలి మానవుడైన ఆదాము పావంచేసి ఈ దైవసాదృశ్యాన్ని కోల్పోయాడు. నరుడు దేవుడు సంకల్పించుకున్నట్లుగా జీవించడం మానివేశాడు. కాని నరజాతి యంతటిలో దేవునికి పోలికగా, దేవుని సంకల్పం ప్రకారం జీవించిన ఏకైక మానుషవ్యక్తి మరియు. నరుణ్ణి గూర్చిన き。 ఆశయాలన్నీ ఆమె యందు