పుట:Punitha Matha.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మౌతుంది. ఈ లోకంలో ఇద్దరే యిద్దరు పవిత్రులు. క్రీస్తు, క్రీస్తు మాతయైన మరియ.

ప్రాచీన క్రైస్తవ వేదశాస్త్రజ్ఞలు మరియను చాలా ఉపమానాలతో స్తుతించారు. పూర్వవేద మందసపుకొయ్య చెడిపోకుండా వుండేదట. పాపకళంకం సోకని మరియుకూడ ఈ మందసపు కొయ్యలాగ చెరువు నెరగనిది. ఆదామేవలను వెళ్లగొట్టాక ప్రభువు శృంగారవనాన్ని సురక్షితం చేసి కాపాడాట్ట. మరియకూడ సురక్షితమైన శృంగారవనం వంటిది. ఆమె మెరుపుతో గూడుకొన్న మేఘంలాంటిది. ఉషస్సుతో నిండిన ఆకాశం లాంటిది. ఈ మెరుపూ, ఈ ఉషస్సు ఆమెకన్న క్రీస్తే ఈ పునీతురాలు పాపపు నరజాతిలో జన్మించినా తానుమాత్రం పాపపు బురదలో అడుగుపెట్టలేదు. అంచేత ఆమె ముండ్లపొదలలో పూచిన లిల్లీపూవు లాంటిది. ముండ్లమొక్కపై వికసించిన గులాబివంటిది. ఆ పరిపూత హృదయ పాపాత్మురాలై పతనమై పోయిన మొదటి యేవకు పరిహారం చేసిన రెండవ యేవ. కనుకనే శ్రీసభ కూడ యూదితు వాక్యాలను మరియకు అన్వయించి "యెరూషలేమును సంతోషపరచే కన్యవు నీవు. ఈ జనులను ఆనందపరచే ధన్యవనీవు" అంటుంది - యూది 15,9. ఆనాడు యూదితు హోలోఫెరెసు అనే శత్రుసైన్యాధిపతి నుండి యెరూషలేమును రక్షించింది. యూదితు విజయం యెరూష లేమునులాగే కన్యమరియు విజయం క్రైస్తవ లోకాన్ని ఆనందపరుస్తుంది.

4. నిష్కళంకమాత బోధించే సత్యాలు

మరియమాత ఎందుకు, ఎలా నిష్కళంకమాత ఐందో చూచాం. ఆమె పావనరూపాన్ని కొంతవరకు ధ్యానించుకున్నాం. ఆ పుణ్యశీల పతిత నరజాతికి చెందిన మనక్తుకొన్ని సత్యాలను బోధిస్తుంది.