పుట:Puneetha Paul bodhalu 2.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ వేదభాగం చాల లోతైంది. క్రీస్తుపట్ల అపారమైన భక్తిని పుట్టించేది. ఆ ప్రభువు మన విలువలన్నిటిలోను పై విలువ కావాలి. అతని కొరకు మనం అన్నీ వదలుకోవాలి. వేటి కొరకు కూడ అతన్ని వదులుకోకూడదు. అతడు మన ఆణిముత్యం, నిధి.


మన జీవితం, శ్రమలు, మరణం క్రీస్తు జీవితం శ్రమలు మరణంతో కలసి పునీతం కావాలి. ఇప్పడు మనం పవిత్రులం అయ్యే మార్గం ఇది. కనుకనే పౌలు ఇప్పడు నాకు జీవించడమంటే క్రీసుని జీవించడమే అని - 1,21. జ్ఞానస్నానం పొందినప్పటి నుండి పౌలు క్రీసులోను, క్రీసు పౌలులోను జీవిసున్నారు. అతడు క్రీనుతో పూర్తిగా ఐక్యమైపోయాడు. జీవితకాలమంతా అతన్ని బోధిస్తున్నాడు. ఇంకా, ఇప్పడు జీవించేది నేను కాదు, నాయందు క్రీస్తే జీవిస్తూన్నాడు అని చెప్పకొన్నాడు - గల2,20. అనగా తాను పూర్వపు యూదుళాగ జీవించడం లేదు, క్రీస్తు భక్తుల్లాగ జీవిస్తున్నాడు. ప్రభువుని అనుభవానికి తెచ్చుకోవడం ఈలా వుంటుంది.


4.ఎఫెసీయుల జాబు


1. పరిచయం

ఈ జాబులో దీన్ని పౌలు చెరనుండి వ్రాసినటుగా వుంటుంది. ఎఫెసు సంఘానికి వ్రాసినటుగా వుంటుంది. కాని అసలు పౌలు దీన్ని వ్రాయలేదు. అతని శిష్యుడు ఎవరో దీన్ని పౌలు పేరుమినాదిగా వ్రాసాడు. నిజానికి ఈ లేఖ ఎఫెసుకి వ్రాసింది కాదు. ఇది ఆనాటి అన్ని సంఘాలకు ఉద్దేశింపబడిన సార్వత్రిక లేఖ. 95 ప్రాంతంలో దీన్ని వ్రాసినటుగా తెలుస్తుంది.

క్రైస్తవులు క్రీస్తుతో ఐక్యమై జీవించాలి అనేది దీనిలోని ముఖ్యాంశం. ఈ భావాన్ని విశదం చేయడానికి రచయిత కొన్ని ఉపమానాలు వాడాడు. క్రీస్తు శిరస్సు, విశ్వాసులు అతని దేహం. క్రీస్తు భక్తులు కలసి ఏక దేవాలయమతారు. ఆ మందిరానికి క్రీస్తు మూలరాయి, ప్రజలు శిలలు. క్రీస్తు భర్త, భక్తులు అతని వధువు.