పుట:Puneetha Paul bodhalu 2.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ వుపమానాలన్నీ ఐక్యతను సూచించేవే. ఈ జాబు క్రైస్తవ సంఘాన్ని కూడ విపులంగా వర్ణిస్తుంది. రచయిత లోతయిన దైవశాస్తాంశాలు చెప్పాడు.

2. తండ్రికి స్తుతి 1,3-14

తండ్రి క్రీస్తుద్వారా మనలను రక్షించాడు కనుక అతన్ని స్తుతించాలి అని చెప్తూ రచయిత ఈ గీతాన్ని ఉదాహరించాడు. బహుశా ఈ గీతం అతడు వ్రాసిందికాదు. ఆనాడు దైవార్చనలో వాడుకలో ఉన్న దాన్ని ఉన్నట్లుగా ఉదాహరించాడు. ఈ గీతం స్తుతి రూపంలో వుంటుంది. దేవుడు క్రీస్తు ద్వారా మనలను రక్షించాడు కనుక అతనికి స్తుతి కలగాలి అని చెప్తుంది. దీనిలోని ముఖ్య భావాలు ఇవి.

1. తండ్రికి స్తుతి కలగాలి - 3 2. లోకాన్ని కలిగించకముందే తండ్రి క్రీస్తుద్వారా మనలను ఎన్నుకొన్నాడు - 4 3.క్రీస్తుద్వారా మనం తండ్రికి పుత్రుల మౌతాం - 5 . 4.క్రీస్తు మరణం ద్వారా మనకు రక్షణం కలిగింది - 7 5.మనం క్రీస్తుతో ఐక్యం కావాలన్నదే దేవుని రక్షణ ప్రణాళిక - 9 6.సమస్త సృష్టి క్రీస్తుతో ఐక్యంగావాలి. అతడు శిరస్సు, మనం అవయవాలం. . 7.దేవుని రక్షణ ప్రణాళికను బట్టి మనం అతన్ని స్తుతించాలి - 12 8. ఆత్మద్వారా మనం మన వారసత్వమైన మోక్షాన్ని పొందుతాం-13-15 తండ్రి క్రీస్తుద్వారా మనలను తన ప్రజగా ఎన్నుకోవడం ఇక్కడ ముఖ్యాంశం. తండ్రి రక్షణ ప్రణాళిక చేసాడు. క్రీస్తుదాన్ని నిర్వహించాడు.

3. యూదులూ అన్వులూ 2,11-22

ఈ భాగంలో క్రీస్తు యూదులను అన్యజాతి ప్రజలనూ ఐక్యం చేయడాన్ని గూర్చి చెపున్నాడు. ఇక్కడ మూడంశాలు వున్నాయి.

1. అన్యులు కూడ నిబంధనలో చేరారు 2,11-13

అన్యజాతి వాళ్లకు సున్నతి లేదు. కనుక వాళ్లకు సీనాయి