పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

105. అంతియోకసు దుర్మరణం - 2 మక్క 9 యూడా మక్కబీయుడు విజయాలు సాధించి దేవాలయాన్ని శుద్ధి చేశాడని అంతియోకసు విన్నాడు. అతడు స్వయంగా పారశీక యుద్ధాల్లో వోడిపోయాడు. పట్టరాని కోపంతో రథాన్ని యెరూషలేముకి తోలమని ఆజ్ఞాపించాడు. ఆ నగరాన్ని నేలమట్టం చేసి శ్మశానంగా మారుస్తానని శపథం చేశాడు. కాని దేవుని శిక్ష దిగిరాగా అతని ప్రేగుల్లో పట్టరాని నొప్పి ప్రారంభమైంది. అతడు వేగంగా పోయే రథం మీది నుండి క్రింద పడగా ఎముకలు గుల్ల అయ్యాయి. సైనికులు అతన్ని పాడెమీద మోసుకొని పోయారు. అతని శరీరం కుళ్లి కంపు కొట్టింది. చివరి క్షణాల్లో ఆ రాజు తన దుష్కార్యాలను తలంచుకొని పశ్చాత్తాపపడ్డాడు. యూదులకు కీడుకి బదులుగా మేలు చేస్తానని ప్రమాణం చేశాడు. కాని ఆ పశ్చాత్తాపం నిజమైంది కాదు. కనుక దేవుడు అతనిపై కరుణ చూపలేదు.కడన ఆ రాజు పరాయి దేశపు కొండల్లో నికృష్టమైన చావు చచ్చాడు. పూర్వం ఇతరులకు ఏయే బాధలు కలిగించాడో ఆ బాధలన్నీ తాను కూడ అనుభవిస్తూ కన్నుమూశాడు. 106. దేవదూతల దర్శనం - 2 మక్క 10,27-31 అంతియోకసు కుమారుడు, అతని సైన్యాధిపతులూ యూదుల మీద యుద్ధం కొనసాగించారు. వాళ్లు పెద్ద సైన్యంతో యూదియా మీదికి దండెత్తి వచ్చారు. యూదా చిన్న సైన్యంతో పోయి వారిని ఎదిరించాడు. యుద్ధం జరుగుతూండగా శత్రు సైన్యం ఐదుగురు దేవదూతలు గుర్రాలనెక్కి రావడాన్ని చూచింది. వాళ్లు ఆయుధాలతో యూదాను కాపాడుతూన్నట్లు గాను, శత్రువుల మీద బాణాలు పిడుగులు రువ్వుతూ న్నట్లుగాను కన్పించారు. ఆ దృశ్యాన్ని చూడగానే విరోధి సైన్యం గుండె చెదరి పారిపోయింది. యూదా సైన్యం వారిని తరిమి వోడించి సర్వనాశం చేసింది. இ)