పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

107. మృత సైనికుల కొరకు పాపపరిహారబలి - 2 మక్క 12,38-44 యూదా చాల యుద్ధాలు చేశాడు. ఒక యుద్ధంలో యూద సైనికులు వోడిపోయి గాయపడి చనిపోయారు. వారి శవాలను పాతిపెట్టేప్పడు వాళ్లు అన్యజాతి ప్రజలు ధరించే తాయెతులను ధరించినట్లుగా తెలిసింది. ధర్మశాస్త్రం ఈ చర్యను అంగీకరించదు. ఇందుకే వాళ్లు యుద్ధంలో వోడిపోయింది. యూదా, అతని అనుచరులు దేవుడు వారి పాపాలను పరిహరించాలని ప్రార్థన చేశారు. ఇంకా యూదా కొంత సొమ్మ ప్రోగుచేసి మృతుల కొరకు పాప పరిహారబలిని సమర్పించడానికి యెరూషలేములోని యాజకులకు పంపాడు. అతడు మృతుల ఉత్థానాన్ని నమ్మాడు. కనుకనే చనిపోయిన సైనికుల కొరకు ప్రార్ధనచేసి బలినిగూడ సమర్పించడానికి ఏర్పాటు చేశాడు. 108. యూదా స్వప్నం - 2 మక్క 15, 11-16 ఒకసారి యుద్ధానికి ముందు యూదా స్వప్నంలో ఓ దృశ్యాన్ని చూచాడు. ఆ దర్శనంలో అంతకుముందే చనిపోయిన భక్తిగల యాజకుడు ఓనియాసు చేతులు చాచి యూదుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. அல் పిమ్మట దర్శనంలో ఓ ప్రవక్త కన్పించాడు. ఓనియాసు అతన్ని యూదాకు పరిచయంజేసి ఇతడు మన ప్రజల కొరకూ, పరిశుద్ధ నగరం కొరకూ నిరంతరం ప్రార్ధన ಪೆಸಿ యిర్మీయా ప్రవక్త అని చెప్పాడు. యిర్మియా యూదాకు బంగారు ఖడ్గాన్ని బహూకరించి దేవుడు దీన్ని నీకు కానుకగా పంపాడు. దీనితో నీవు శత్రువులను నాశం చేయి అని చెప్పాడు. యూదా ఈలాంటి సంఘటనలను వివరించి చెప్పి సైనికులను ప్రోత్సహించే వాడు. వాళ్లు యుద్ధంలో ఆయుధబలాన్ని గాక దైవబలాన్ని నమ్మాలని హెచ్చరించే వాడు. దేవుని కృపవల్లనే అతడు నానా యుద్ధాల్లో విజయాన్ని సాధించాడు. QD