పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారిలో పెద్దవాడు రాజా! మేము ప్రాణాలైనా వదలుకొంటాం గాని ధర్మ శాస్తాన్ని మీరం అని చెప్పాడు. శత్రువులు అతని అవయవాలను నరికివేసి గనగన మండే పెనముపై కాల్చి చంపి వేశారు. విరోధులు రెండవ వాణ్ణి కూడ ఆలాగే హింసించడానికి పూను కొన్నారు. అతడు రాక్షసుడా! నీవు మమ్మ చంపితే చంపవచ్చుగాక. దేవుడు మాకు పునరుత్థాన భాగ్యాన్ని దయచేస్తాడు సుమా అని చెప్పి ప్రాణాలు విడిచాడు. హింసకులు మూడవ సోదరుని అవయవాలను కూడ నరికివేశారు. అతడు ఈ అవయవాలకంటె ప్రభువు ఆజ్ఞలు విలువైనవి. దేవుడు వీటిని మాకు మళ్లా దయచేస్తాడు అని చెప్పి చనిపోయాడు. నాల్గవవాడు ప్రభువు మాకు నూత్న జీవాన్ని ప్రసాదిస్తాడు. కాని మీకు పునరుత్థానం ඒඨ ෂඩ් పల్కి బాధలు అనుభవించి చనిపోయాడు. ఐదవ వాడు రాజా! నీకు దేవుని శిక్ష తప్పదు అని మందలించి చనిపోయాడు. ఆరవవాడు మా పాపాల వలన మేము ఈ శిక్షలు అనుభవిస్తున్నాం. కాని మీరు దేవునితో పోరాడుతున్నారు. మీకు శిక్ష తప్పదు అని చెప్పి ప్రాణాలు సమర్పించాడు. చివరన కడగొట్టవాని వంతు వచ్చింది. రాజు అతన్ని నీవు నామాట వింటే నిన్ను ధనవంతుణ్ణి చేసి రాజమిత్రుల జాబితాలో చేరుస్తాను అని ప్రలోభపెట్టాడు. వాని తల్లి అతన్ని హెచ్చరించి నాయనా! నేను నిన్ను కని పెంచాను. నీవు నా మాట విని నీయన్నలు పోయిన త్రోవలోనే పో. మనకందరికి ఉత్థానం లభిస్తుంది అని ప్రోత్సహించింది. అతడు కూడ రాజుని మందలించి హింసలు అనుభవించి ప్రాణాలు విడిచాడు. శత్రువులు కడన తల్లిని కూడ క్రూరంగా చంపివేశారు. ఈ రీతిగా ఆ రోజుల్లో చాలమంది భక్తులు దేవుణ్ణి నమ్మి హింసలకు లొంగిప్రాణాలు త్యజించారు. இ)