పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పునరుద్ధరించాడు. చాలమంది యూదా విజయాలకు సంతోషించి అతనికి అనుచరులయ్యారు. ప్రభువు యూదాకు తోడుగా వుండి అన్ని పోరాటాల్లోను విజయాన్ని ప్రసాదించాడు. 103. ఎలియాసరు ప్రాణత్యాగం - 2 మక్కబీ 6, 18-31 అంతియోకసు ఎఫిఫానెసు అనే గ్రీకురాజు యూదులను హింసిస్తు న్నాడు. అతడు యూదుల మత గ్రంథాలను తగలబెట్టించాడు. వాళ్లు ధర్మశాస్తాన్ని పాటించగూడదని ఆజ్ఞాపించాడు. ఆ రోజుల్లో ఎలియాసరు అనే 90 ఏండ్ల వృధుడు వుండేవాడు. అతడు నిష్టతో మోషే ధర్మశాస్తాన్ని పాటించేవాడు. హింసకులు అతన్ని ధర్మశాస్త్రం అంగీకరించని పంది మాంసం తినమని నిర్బంధం చేసినా అతడు తినలేదు. కనుక అతన్ని చంపివేయాలని నిర్ణయం చేశారు. అతని స్నేహితులు అయ్యా! నీవు వేరే మాంసం తిను. పందింమాసం తిన్నట్లుగా నటించు. ఈ విధంగా నీ ప్రాణాలను రక్షించుకోవచ్చు అని సలహా యిచ్చారు. కాని యెలియూసరు నా ప్రాయంవాడు ఈలా మోసం చేయడం తగదు. నన్ను జూచి యువజనం 90 యేండ్ల యీడున యెలియాసరు ధర్మశాస్రాన్ని మీరితే మన మెందుకు మీరకూడదని అపమార్గం పడతారు. పైగా నేను మీనుండి చావును తప్పించు కొన్నా దేవుని శిక్షను తప్పించుకోలేను కదా అని జవాబిచ్చాడు. హింసకులు ఆ ముసలిని కొరడా దెబ్బలతో మోడారు. అతడు నేనీ దెబ్బలు తప్పించుకొనే వాడినే. ఐనా ప్రభువు పట్ల భయభక్తులవల్ల వీటిని అనుభవిస్తున్నాను అని పల్కి ప్రాణాలు విడిచాడు. ఆ రీతిగా అతని మరణం పెద్దలూ పిల్లలూ అందరికీ ఆదర్శప్రాయమైంది. 104. ఏడురు సోదరుల ప్రాణత్యాగం - 2 మక్కబీ 7 హింసకులు ఏడురు సోదరులను వారి తల్లిని బంధించి అంతి యోకసు రాజు దగ్గరికి కొనివచ్చిపందిమాంసం తినమని నిర్బంధం చేసారు.