పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు100. అంతియోకసు వేదహింసలు అలెగ్జాండరు చక్రవర్తి దండయాత్రల తర్వాత పాలస్తీనా దేశం సిరియా రాజుల అధీనంలోకి వచ్చింది. ఐదవ అంతియోకసు రాజు యూదులకు ప్రబల శత్రువయ్యాడు. అతడు యూదుల ధర్మగ్రంథాలు తగలబెట్టించాడు. దేవాలయాన్ని కొల్లగొట్టాడు. ధర్మశాస్త్ర నియమాలను పాటించగూడదని ఆజ్ఞాపించాడు. సున్నతిని నిషేధించాడు. యూదులకు వేదహింసలు ముమ్మరమయ్యాయి. భక్త విశ్వాసాలు లేనియూదులు గ్రీకు మతంలో చేరిపోయి వారి విగ్రహాలను ఆరాధించడం మొదలుపెట్టారు. 101. మత్తతీయ తిరుగుబాటు - 1మక్క 2 ఆ వేద హింసల కాలంలో మోదేను నగర యాజకుడైన మత్తతీయ యూదులకు నాయకుడయ్యాడు. అతడు యూద మతాచారాలను పునరుద్ధరించాడు. ధర్మశాస్త్ర నియమాలను పాటించండని ప్రజలను ప్రోత్సహించాడు. అన్యదైవాలను పూజించే వారిని పట్టి శిక్షించాడు. అంతియోకసు రాజుకి ఎదురు తిరిగి కొండలకు పారిపోయాడు. యూద మతాభిమానులు చాలమంది అతనితో చేరిపోయారు. వాళ్లంతా పెద్దదండుగా గుమిగూడి పవిత్రయుద్ధం ప్రారంభించారు. మత్తతీయ చనిపోకముందు తన కుమారుల్లో మూడవవాడైన యూదా మక్కబీయుని ఈ దండుకి నాయకుణ్ణిగా నియమించాడు. 102. యూదా మక్కబీయుని విజయాలు - 2 మక్క 8 యూడా మక్కబీయుడు సింహంవలె పరాక్రమం గలవాడు. అతడు పెద్ద దండుని ప్రోగుచేసికొని అంతియోకసు రాజుమీదికి యుద్ధానికి పోయాడు. ఆ రాజు పంపిన సైన్యాధిపతులను చాలమందిని ఓడించాడు. రాజు అమంగళం చేసిన దేవాలయానికి తిరిగి శుద్ధిచేశాడు. రాజు ధ్వంసం చేసిన పీఠాన్ని పునరుద్ధరించాడు. దేవాలయంలో పూజలు, బలులు @