పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భర్తలను చంపివేసింది. ఓ దినం పనికత్తె సారాను అవమానించగా ఆమె దుఃఖంతో ఆత్మహత్య చేసికోబోయి మళ్లా మానుకొంది. తోబీతు రాగీసు పట్టణంలో వసించే గబాయేలు దగ్గర డబ్బు దాచి వుంచాడు. తాను చనిపోకముందే కుమారుని ఆ ಓಬು తీసికొని రమ్మన్నాడు. అతనికి ఓ ప్రయాణ స్నేహితుడు అవసరమయ్యాడు. రఫాయేలు దేవదూత అసరయ అనేపేరుతో అతనికి స్నేహితుడుగా కుదిరాడు. కాని అతడు దేవదూత అని తోబియాకు తెలియదు. వాళ్లు రాగీసుకు ప్రయాణం చేస్తూ టిగ్రిసు నదిలో దిగగా పెద్ద చేపవచ్చి, తోబియా కాలు పట్టుకొంది.అతడు దాన్ని చంపి దాని గుండె, కాలేయం, పిత్తం తీసి దాచుకొన్నాడు. ఆ స్నేహితులు దారిలో రగూవేలు ఇంటిలో బస చేశారు. అసరయా సలహాపై తోబియా తనబంధువైన సారాను పెండ్లి జేసికొన్నాడు. చేప గుండె, కాలేయం కాల్చి పొగవేయగా సారాను పట్టివున్న పిశాచం పారిపోయింది. అసరయూ అక్కడి నుండి రాగీసులోని గబాయేలు దగ్గరికి వెళ్లి సొమ్ము తీసికొని వచ్చాడు. వివాహోత్సవం ముగిసాక తోబియా సారా అసరయలతో, డబ్బుతో నీనివేకు తిరిగివచ్చాడు. చేపపిత్తాన్ని తండ్రి కన్నులకు పూయగా అతనికి మరల చూపు వచ్చింది. తండ్రీ కుమారులు అసరయాకు జీతం చెల్లించ బోయారు. కాని అతడు నేను దేవునికి సేవలు చేసే ఏడురు దేవదూతల్లో ఒకణ్ణి. నా పేరు రఫాయేలు. మీ పుణ్యకార్యాలను బహూకరించి మీకు మేలు చేయడానికి దేవుడే నన్ను పంపాడు అని చెప్పి అదృశ్యుడయ్యాడు. తండ్రి కుమారులు నేలమీద బోరగిలబడి దేవుణ్ణి స్తుతించారు. తోబీతు చనిపోగా నీనివే పట్టణం లోనే పాతిపెట్టారు. తోబియా ఎక్భటానాకు వెళ్లి, మామయింటిలో వసించాడు. అతడు 117వ యేట చనిపోయాడు. అతడు చనిపోకముందే మాదియా రాజు నీనివే నగరాన్ని జయించి నాశంచేశాడు.