పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


అతడు సైనికులకు విందుచేసి యూదితుని కూడ ఆహ్వానించాడు. ఆమె కూడ విందుకు వచ్చింది. కాని అక్కడ తాను తెచ్చుకొన్న సొంత ఆహారాన్నే భుజించింది. హోలోఫెర్నెసు ఆమె మీద మరలుకొని పట్టరాని సంబరంతో ఎప్పడూ త్రాగనంత ద్రాక్షసారాయం త్రాగి మత్తెక్కిపడకమీద పడిపోయాడు. అప్పటికే ప్రొదుపోయినందున సైనికులందరూ గుడారం నుండి వెళ్లిపోయారు. అక్కడ యూదితు సైన్యాధిపతి ఇద్దరే మిగిలివున్నారు. ఆమె దేవునికి ప్రార్ధన చేసి ధైర్యం తెచ్చుకొని మైకంతో పడివున్న సైన్యాధిపతి తలను అతని కత్తితోనే నరికి వేసింది. దాన్ని సంచిలో పెట్టుకొని నేర్పుతో శత్రుశిబిరాన్ని తప్పించుకొని బెతూలియాకు తిరిగి వచ్చింది. అస్సిరియనులు తమ నాయకుడు గతించడం చూచి గుండె చెదరి పారిపోయారు. యూద సైనికులు వారిని తరిమికొట్టి కొల్ల సొమ్ము దోచుకొన్నారు. యెరూషలేము నుండి ప్రధాన యూజకుడు విచ్చేసి యూదితు సాహసాన్ని మెచ్చుకున్నాడు. నీవలన యెరూషలేముకి కీర్తి కలిగింది అని స్తుతించాడు. యిప్రాయేలు దేశమంతట యూదితు పేరు మారు మ్రోగింది. ఆ వీర వనిత తన 105వ యేట పరమపదించింది. 99. తోబీతు కథ అస్సిరియా రాజులు తోబీతుని ప్రవాసానికి తీసికొని పోయారు. అతడు పరాయి దేశంలో పేదసాదలను భూస్థాపనం చేయడం, దానధర్మాలు చేయడం మొదలైన కరుణ కార్యాలు చేసేవాడు. అతని భార్య అన్నా కుమారుడు తోబియా. వాళ్లు నీనివే నగరంలో వసించేవాళ్లు. ఒకరోజు తోబీతు నిద్రిస్తుండగా పిచ్చుకలు అతని కన్నులలో రెట్ట విడిచాయి. అతనికి చూపు పోయింది. ఎక్బటానా నగరంలో వసించే రగూవేలు పుత్రిక సారాను దయ్యం బట్టి పీడిస్తుంది. ఆమెకు ఏడుసార్లు పెండ్లయింది కాని దయ్యం ఏడురు GÐ