పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యెరూషలేము మళ్లా వృద్ధి చెందడం వారికి యిష్టం లేదు. నెహెమ్యా అర్థరాత్రిలో వెళ్లి పాడయిపోయిన ప్రాకారాన్ని పరీక్షించి వచ్చాడు. గోడను కట్టడానికి జనాన్ని ప్రేరేపించాడు. అందరూ పనికి పూనుకొన్నారు. కాని శత్రునాయకులైన సన్బల్లటు, తోబీయా మొదలైన వాళ్లు వారికి అడ్డు వచ్చి పనిని ఆపవేయబోయారు. ప్రజల్లో సగం మంది ఆయుధాలు ధరించి విరోధులను ఎదిరించారు. మిగిలిన సగం మంది గోడ కట్టారు. ఆ కట్టే వాళ్లు కూడ ఒక చేత ఆయుధాలు పట్టి ఇంకో చేతితో గోడమీద పనిచేశారు. క్రీ.పూ.445లో గోడ కట్టడం ముగించారు. ద్వారాలు ఏర్పాటు చేశారు. నెహెమ్యా గోడను కాపాడ్డానికి నాయకులను నియమించాడు. అంతకు ముందే దేవాలయాన్ని కట్టి ముగించారు. ప్రవాసం నుండి తిరిగివచ్చిన యూదులూ, నగరం చుట్టుపట్ల వుండిపోయిన యూదులూ మళ్లా యెరూషలేములో వసించడం మొదలు పెట్టారు. నెహెమ్యాలేవీయులను పిలిపించి ప్రాకారానికి ప్రతిష్ట చేయించాడు. అతడు యెరూషలేము పునర్నిర్మాణానికి తోడ్పడిన వీరుడు. 98. యూదితు కథ అస్సిరియా రాజైన నెబుకద్నెసరు తన సైన్యాధిపతి హోలోఫెర్నెసుని పశ్చిమ జాతుల మీదికి యుద్ధానికి పంపాడు. అతడు వచ్చి యూదుల నగరమైన బెతూలియాను ముట్టడించాడు. పట్టణానికి నీటి సరఫరాను ఆపివేశాడు. ప్రజలు అతనికి లొంగి పోదామనుకొన్నారు గాని యూదితు ఆ నిర్ణయానికి అడ్డువచ్చింది. ఆమె విధవ. దైవభక్తీ, ధైర్యసాహసాలు కల స్త్రీ. దేవునికి ప్రార్థన చేసి దైవబలంతో నగరాన్ని కాపాడ్డానికి పూనుకొంది. ఆమె హోలోఫెర్నెసు శిబిరానికి వెళ్లి తాను బెతూలియా నుండి పారిపోయి వచ్చినట్లుగా చెప్పకొంది. సెన్యాధి పతిని ఉబ్బించి అతనికి యుద్ధంలో విజయం కలుగుతుందని తీయని మాటలు చెప్పింది. హోలోఫెర్నెసు యూదితు అందానికి బ్రమసి ఆమైన్లు చెరచాలని నిశ్చయించుకొన్నాడు.