పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ ప్రతిమే తింటుందని విశ్వసించేవాడు. ఆ దేవతకు డెబ్భయిమంది పూజారులు వున్నారు. దానియేలు విగ్రహం ఆ భోజన పదార్థాలను తినడం ඵ්ඨ. ఇక్కడేదో మోసం వుందని రాజుతో చెప్పాడు. ఒకరాత్రి పూజారులు బేలు దేవతకు భోజనం పెట్టారు. සංඛීඨෂා రహస్యంగా దేవళంలో బూడిద చల్లించాడు. దేవాలయం తలుపులు మూసి వాటికి రాజముద్ర వేశారు. మరునాడు ఉదయం రాజు తలుపులు తీసిచూడగా భోజనం లేదు. రాజు బేలు విగ్రహమే అన్నం ఆరంగించింది అనుకొన్నాడు. కాని దానియేలు రాజుకి బూడిద మీద అడుగుల గురుతులు చూపించాడు. రాజు పూజారులను నిలదీయగా వాళ్లు నిజం చెప్పారు. వాళ్లు రోజూ రహస్య ద్వారం గుండా దేవాలయంలోకివెళ్లి ఆ భోజనాన్ని తినిపోయి బేలు దేవతే దాన్ని ఆరగించిందని ప్రచారం చేసేవాళ్లు. రాజు మోసం తెలుసుకొని పూజారులను చంపించాడు. దానియేలు విగ్రహాన్నీ దేవళాన్నీ కూడ నాశం జేయించాడు. 94. ఘట సర్పం - దాని 14 బాబిలోనీయులు ఘట సర్పాన్ని దేవతగా భావించి ఆరాధించేవాళ్లు, దానియేలు ఇది దేవత కాదు, నేను దీన్ని చంపగలను అని సవాలు చేశాడు. రాజు అనుమతి నిచ్చాడు. దానియేలు కీలు, క్రొవ్వు, వెండ్రుకలు కలిపి ఉడక బెట్టి ఉండలు చేసి పాము చేత తినిపించాడు. అది పొట్ట పగిలి చచ్చింది. ప్రజలు నీవు యూదుడవుగా మారిపోయి మా దేవతను చంపించావు అని రాజు మీద తిరగబడ్డారు. అతడు చేసేది లేక దానియేలుని వారికి అప్పగించాడు. వాళ్లు అతన్ని సింహాలగుంటలో త్రోయించారు. అతడు ఆ గుంటలో ఏడు రోజులు ఉన్నాడు. ఐనా వన్యమృగాలు అతనికి ఏ హాని చేయలేదు. తర్వాత రాజు దానియేలుని వెలుపలకి తీయించి అతన్ని కాపాడిన దేవుణ్ణి కొనియాడాడు. అతనిపై నేరం తెచ్చిన వారిని అదే గుంటలో పడవేయగా సింహాల్లు వెంటనే మ్రింగివేశాయి.