పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


తోటలో స్నానం చేయబోతూండగా అక్కడ దాగుకొని వున్న న్యాయాధిపతులు తమ కోర్మెను తీర్చమని ఆమెను నిర్బంధం చేశారు. ఆమె నేను ప్రభువుకి ద్రోహంగా పాపం చేయడం కంటె మీరు పెట్టే శిక్షకు బలి కావడమే మేలు అని పల్కింది. వాళ్లు కపట బుద్ధితో సూసన్న తోటలో ఓ యువకునితో వ్యభిచారం చేస్తుండగా మేము చూచామని దొంగ సాక్ష్యం పలికి ఆమె మీద నేరం తెచ్చారు. 8 న్యాయాధిపతులు ఆ యేటి పెద్దలు, వృదులు. కనుక ప్రజలు విచారణ జరిపించి వారి సాక్ష్యాన్ని నమ్మి ఆమెకు మరణ శిక్ష విధించారు. సూసన్న కన్నీరుగార్చి దేవా! నేను నిర్దోషిని. నీవు నన్ను కాపాడవా అని వేడుకొంది. దేవుడు ఆ భక్తురాలి మొరవిని దానియేలుని ప్రేరేపించాడు. అతడు ఈమె మరణం నాకు సమ్మతం కాదు అని పలికి రెండవసారి విచారణం జరిపించాడు. ఇద్దరు న్యాయాధిపతులను వేరుపరచి మొదటి వాణ్ణి పిలిపించి నీవు ఈమె ఏ చెట్టుక్రింద పాపం చేస్తుండగా చూచావో చెప్ప అని అడిగాడు. అతడు మస్తకి చెట్టు క్రింద అని జవాబు చెప్పాడు. పిమ్మట అతన్ని ప్రక్కకు పంపి రెండవవాణ్ణి పిలిపించి ෂධී ప్రశ్న అడిగాడు. అతడు సిందూరం క్రింద వీళ్లిద్దరు కలవడం నేను చూచాను అన్నాడు. వారి సాక్ష్యాలు అతకలేదు. కావున ప్రజలు వాళ్లు కల్లబొల్లి కబుర్లు చెప్పారని గ్రహించారు. దొంగసాక్షం పలికిన వాళ్లు నిందితునికి పడిన శిక్షను తామే అనుభవించాలి. కనుక సూసన్నకు బదులుగా ఆ యిద్దరికి మరణ శిక్ష పండింది. దేవుడు నిర్దోషియైన సూసన్నను చావునుండి తప్పించినందుకు అందరూ ప్రభువుని స్తుతించారు. తెలివితో తీర్పు జరిపాడు కనుక దానియేలు కీర్తి పెరిగిపోయింది. 93. దానియేలు, బేలు పూజారులు - దాని 14 కోరెషు బాబిలోనియా రాజ్యానికి అధిపతి అయ్యాడు. దానియేలు అతనికి ఆప్తమిత్రుడు. ఆ రాజు బేలు దేవత విగ్రహాన్ని పూజించేవాడు. ఆ ప్రతిమకు రోజూ చాల భోజన పదార్తాలు అందించే వాళ్లు. రాజు వాటిని