పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

95. ఎస్తేరు కథ అహష్వేరోషు పర్షియా రాజ్యానికి రాజు. అతడు పెద్ద విందుచేసి ఆ విందులో తన భార్య వఫ్టి అతిథులకు తన సౌందర్యాన్ని చూపించాలని ఆజ్ఞాపించాడు. చర్య అమర్యాదగా భావించి వష్టి నిరాకరించింది. కనుక రాజు ఆమెను రాణి పదవి నుండి తొలగించి క్రొత్త రాణిని ఎన్నుకోగోరాడు. యూదుల ఆడపడుచు ఎస్తేరుకు ఆ పదవి దక్కింది. కాని ఆమె యూదజాతి స్త్రీ అని యెవరికీ తెలియదు. మొర్డెకయి ఎస్తేరుకి పెదనాయన కుమారుడు. రాజభవనంలో ఉద్యోగి. రాజు ప్రధాన మంత్రి హామాను. మొర్డెకయి తప్ప అందరూ అతనికి దండం పెట్టేవాళ్లు. కనుక హామాను అతనిమీద ద్వేషం పెంచుకొని యూదజాతి నంతటినీ నాశం చేయాలని సంకల్పించుకొన్నాడు. ఒకసారి సేవకులు రాజు మీద కుట్ర పన్నగా మొర్డెకయి దాన్ని బట్టబయలు చేశాడు. అతనిపేరు దస్తావేజులో వ్రాసివుంచారు. హామాను యూదులను చంపించి వారి ఆస్తులను స్వాధీనం చేసికోవడానికి కుట్రతో రాజు చేత శాసనం చేయించాడు. మొర్డెకయిని ఉరితీయడానికి 75 అడుగుల యెత్తున ఉరికంబం కూడా సిద్ధం చేయించాడు. రాజు ఒకరాత్రి నిద్రబట్టక దస్తావేజులు చదువుకొని మొర్టెకయి ఉపకారాన్ని జ్ఞప్తికి తెచ్చుకొన్నాడు. హామానుని పిలిపించి మొర్డెకయిని గుర్రమెక్కించి నగర వీధిలో త్రిప్పమని ఆజ్ఞాపించాడు. హామానుకి అనుకో కుండ పరాభవం కలిగింది. రాజు పిలువనిదే ఎవరూ అతని సన్నిధిలోకి వెళ్లకూడదు. ఎస్తేరు ధైర్యం జేసి అతని చెంతకు వెళ్లి అతన్ని విండుకి ఆహ్వానించింది. ఆ విందులో ఆమె తన ప్రజలను కాపాడమని రాజుని వేడుకొంది. హామాను కుట్రను Q2)