పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/11

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


ఆరాధించాలని శాసనం చేయించాడు. ఈ యాజ్ఞ మీరిన వారిని అగ్ని కుండంలో పడవేస్తారు. కాని దానియేలు ముగ్గురు మిత్రులు మేము స్వర్గం తోని దేవుణ్ణి తప్ప మరియేవిగ్రహాన్ని కొలవమన్నారు. రాజు కోపించి వారిని అగ్నికుండంలో త్రోయించాడు. అది గనగన మండుతూ వుంది. కాని దేవ దూత ఆ యగ్నిలోనికి ప్రవేశించి ముగ్గురు బాలకులను ఏ హాని కలగకుండ కాపాడాడు. ఆ ముగ్గురు కుండంలో దేవుణ్ణి స్తుతించారు. నెబుకద్నెసరు అగ్నికుండంలోని నల్లురు వ్యక్తులు సురక్షితంగా వుండడం చూచి విస్తు పోయాడు. వారిని కుండం నుండి బయటకు తీసారు. వారి దేహాల మీద పొగ వాసన కూడ లేదు. రాజు ఎవరు గాని ఆ బాలకుల దేవుణ్ణి తూలనాడ కూడదని ఆజ్ఞాపించాడు. వారిని తనరాజ్యంలో పెద్ద పదువులిచ్చి సత్కరించాడు. 90. గోడమీద వింత వ్రాత - దాని 5 నెబుకద్నెసరు తర్వాత అతని కుమారుడు బెల్లస్సరు రాజయ్యాడు. అతడు గొప్ప విందు చేయించి కొలువుకాళ్లను ఆహ్వానించాడు. ఆ విందులో యెరూషలేము దేవళం నుండి కొల్లగొట్టి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెప్పించారు. రాజు, అతని భార్యలు, కొలువుకాళ్లు ఆ పాత్రల నుండి ద్రాక్షరసాన్ని త్రాగి తమ దేవతలను స్తుతించారు. అప్పడు ఓ చేయి దీపపు వెలుగులో గోడమీద ఏమో వ్రాసింది. ఆ వ్రాతను చూచి రాజు భయపడ్డాడు. తన మాంత్రికులను పిలిపించాడు గాని వాళ్లు ఆ వ్రాతను చదివి అర్థం చెప్పలేక పోయారు. అటుతర్వాత దానియేలుని పిలువగా అతడు రాజుకి వ్రాత భావం ఈలా తెలియజేశాడు. దేవుడు గర్వితుడైన నీ తండ్రిని రాజ పదవి నుండి తొలగించాడు. ఇప్పడు నీవు, నీ భార్యలు దేవాలయం నుండి తెచ్చిన పాత్రలలో ద్రాక్షరసం త్రాగి దేవుణ్ణి అవమానించారు. ఆ గోడమీది వ్రాతను దేవుడే వ్రాయించాడు. దాని భావం ఇది. దేవుడు నీ పరిపాలనా దినాలను లెక్కపెట్టి వాటిని ముగించాడ్రు. అతడు నిన్ను త్రాసులో పెట్టి