పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/12

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదుతూయగా నీవు తేలికగా కన్పించావు. ప్రభువు నీ రాజ్యాన్ని విభజించి దాన్ని అన్యజాతివారికి ఇచ్చివేశాడు అని ఆ వ్రాతకు అర్థం చెప్పాడు. ఆ ෆශ්‍රී మాదీయుల రాజైన దర్యావేషు బెల్లస్సరును వధించి అతని రాజ్యాన్ని చేజిక్కించుకొన్నాడు. 91. సింహాల గుంటలో దానియేలు - దాని 6 దర్యావేషు రాజు తన రాజ్యానికి ముగ్గురు పర్యవేక్షకులను నియమించాడు. వారిలో దానియేలు ఒకడు. కాని మిగిలిన యిద్దరికీ అతని మీద అసూయ పుట్టింది. వాళ్లు దానియేలుని చిక్కుల్లో పెట్టగోరి రాజు చేత క్రొత్త శాసనం చేయించారు. ముప్పయి రోజులపాటు ప్రజలందరు రాజుని దేవునిగా భావించి అతనికి మాత్రమే ప్రార్థన చేయాలి. ఇంకే దేవునికి ప్రార్ధన చేయకూడదు. ఈ యాజ్ఞ మీరిన వారిని సింహాల గుంటలో త్రోయించాలి. ఇది శాసనం. కాని దానియేలు మాత్రం ఎప్పటి మాదిరిగానే రోజుకి మూడుసార్లు తన దేవునికి ప్రార్థన చేశాడు. శత్రువులు ఈ సంగతిని తెలుపగా రాజు అనిష్టంగానే దానియేలుని సింహాల గుంటలో త్రోయించాడు. ఆ గుంటను బండతో కప్పి దానికి రాజముద్ర వేశారు. మరునాటి వుదయం రాజు గుంట దగ్గరికి వెళ్లి చూడగా దానియేలు సురక్షితంగానే వున్నాడు. దేవుడు సింహాల నోరు మూయించి అవి అతనికి హాని చేయకుండేలా శాసించాడు. రాజు సంతోషించి దానియేలుని గుంటనుండి బయటకి తీయించాడు. కాని అతని విరోధులను గుంటలో త్రోయించాడు. వెంటనే సింహాలు వారిని చంపి తినివేశాయి. 92. సూసన్న కథ - దాని 18 యూదులు బాబిలోనియా ప్రవాసంలో వసించే రోజుల్లో యొవాకీము అనే సంపన్నుడు వుండేవాడు. అతని భార్య సూసన్న ఆమె చాల అందగత్తె, ఇద్దరు న్యాయాధిపతులకు ఆమెమీద కోరిక పుట్టింది. ఓ దినం సూసన్న GO