పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అజరయా బాబిలోనియా దేశంలో నెబుకద్నెసరు రాజుకి కొలువు చేస్తున్నారు. వారికి బెల్లెషాజరు, షడ్రకు, మేషకు, అబెద్నెగో అని బాబిలోనియా పేర్లు పెట్టారు. ఒకసారి రాజుకి కల వచ్చింది. కాని అతడు మరుసటి రోజుకల్లా ఆ కలను మరచిపోయాడు. అతడు తన మాంత్రికులను పిలిపించి మీరు నా కలనూ దాని భావాన్నీ కూడ వివరించి చెప్పమని అడిగాడు. వాళ్లు నీ కల యేమో చెప్తే గాని దాని భావాన్ని వివరించి చెప్పలేము అన్నారు. రాజు కలనూ దాని భావాన్నీ మీరే చెప్పాలి. లేకపోతే మిమ్మందరినీ చంపి స్తానని శపథం చేశాడు. దానియేలుకి ఈ సంగతి తెలిసింది. అతడు ప్రార్ధన చేయగా దేవుడు కలనూ దాని అర్ధాన్నీ గూడ తెలియజేశాడు. దానియేలు రాజు దగ్గరికి వెళ్లి మొదట అతని కలను తెలియజేశాడు. రాజు స్వప్నంలో భయంకరమైన విగ్రహాన్ని చూచాడు. దాని భాగాలను నానా లోహాలతో చేశారు. కొండనుండి ఓ బండ వచ్చి ఆ బొమ్మను తాకి దాన్ని పిండి జేసింది. ఆ పిండి గాలికి ఎగిరిపోయింది. విగ్రహం మాయమై పోయింది. బండ మాత్రం పెరిగి లోకమంతటా వ్యాపించింది. ఇది కల. తర్వాత దానియేలు కల భావాన్ని వివరించాడు. ఆ విగ్రహం నెబుకదెసరు రాజ్యాన్నీ దాని తర్వాత వచ్చే మూడు రాజ్యాలనూ సూచిస్తుంది. కొండ బండ దైవరాజ్యాన్ని సూచిస్తుంది. ఆ బండ పై నాలు రాజ్యాలను కూలద్రోస్తుంది. ఇది కలభావం. రాజు దానియేలునూ అతని మిత్రులనూ మెచ్చుకొని వారిని బహుమతులతో సత్కరించాడు. అతడు కొల్చే దేవుడు దేవాధి దేవుడని అంగీకరించాడు. 89. బంగారు విగ్రహాన్ని ఆరాధించాలి - దాని 3 నెబుకద్నెసరు తొంభై అడుగుల బంగారు విగ్రహాన్ని తయారు చేయించి దాన్ని దూరా మైదానంలో నెలకొల్పాడు. అది అతని విగ్రహమే. దాన్ని ప్రతిష్టించేప్పడు మంగళవాద్యాలు విన్పింపగానే జనమంతా దాన్ని GD