పుట:Pratha Nibandhana Kathalu 2.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
50. దావీదు యోనాతానుల మైత్రి - 1సమూ 18, 1-3

సౌలు కుమారుడు యోనాతాను. అతనికీ దావీదుతో గాఢమైన మైత్రి యేర్పడింది. అతడు తన దుస్తులూ ఆయుధాలూ దావీదు కిచ్చి అతనితో నిబంధనం చేసికొన్నాడు. సౌలు తర్వాత దావీదు రాజౌతాడని యోనాతాను పసికట్టాడు. తాను దావీదు క్రింద రెండవ అధికారిగా మాత్రమే వుంటాడు. ఐనా అతడు దావీదును చూచి అసూయ చెందలేదు. అతన్ని యింకా ప్రోత్సహించాడు. అపాయాలనుండి కాపాడాడు. అతనితో రెండవసారి కూడ ఒడంబడిక చేసికొన్నాడు –23, 17-18. వారిది నిస్వార్ధమూ ఆదర్శప్రాయమూ ఐన మైత్రి.

51. సౌలు అసూయ - సమూ 15, 6-11

దావీదుకి పేరు ప్రఖ్యాతులు రావడం చూచి సౌలు అసూయ చెందాడు. అతన్ని చూచి భయపడ్డాడు. ఒకసారి సౌలు దావీదు ఇద్దరూ యుద్ధంలో ఫిలిస్టీయులను గెల్చి తిరిగివస్తున్నారు. దారిలో స్త్రీలు పాటలు పాడి నాట్యం జేస్తూ వారికి స్వాగతం పల్మారు. వాళ్లు సౌలు వేయిమందిని చంపాడు. కాని దావీదు పదివేలమందిని చంపాడు అని పాడారు. ఆ పాట వినేసరికి సౌలుకి గుర్రుమంది. ఇతడు నాకంటె గొప్ప వీరుడై పోయాడని అసూయ చెందాడు. ఆ మరుసటి రోజు సౌలుకి ఆహ్లాదం కలిగించడానికి దావీదు అతని ముందు సితారా వాయిస్తున్నాడు. సౌలు ఆగ్రహంతో తన చేతిలోని ఈటెను దావీదు మీదికి విసిరాడు. అతన్ని దానితో పొడిచి గోడకు గ్రుచ్చాలని సౌలు తలంపు. కాని దావీదు నేర్పుతో తప్పించుకొన్నాడు. ఈలా రెండుసార్లు జరిగింది.

52. కొండగుహలో సౌలు - 1సమూ 24

దావీదు సౌలునుండి పారిపోయి ఎంగడీ ఎడారిలో తలదాచుకొంటు న్నాడు. అతన్ని పట్టుకోవడానికి సౌలు మూడువేలమంది యోధులతో పయనమై వచ్చాడు. ఆ యెడారిలో ఓ కొండగుహ వుంది. సౌలు మలవిసర్జనకై ఆ గుహలోనికి వెళ్లాడు. అంతకు ముందే దావీదు తన అనుచరులతో ఆ గుహలోనే దాగుకొని వున్నాడు. దావీదు అనుచరులు