పుట:Pratha Nibandhana Kathalu 2.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇదిగో! సౌలు మన చేతికి జిక్కాడు, చంపివేద్దాం అన్నారు. కాని దావీదు మనం దేవుని అభిషిక్తునికి కీడు చేయకూడదు అని చెప్పాడు. అతడు మెల్లగాబోయి సౌలుకి తెలియకుండానే అతని ఉత్తరీయం అంచుని కత్తిరించుకొని వచ్చాడు. సౌలు వెలుపలికి రాగానే దావీదు అతన్ని కలిసికొని ప్రభూ! ఈ బట్టముక్కను చూడు. ఈనాడు నీవు మా చేతికి చిక్కగా నేను నిన్ను చంపలేదు. దేవుడు ఎన్నుకొనిన రాజుకి హాని చేయకూడదని నా విశ్వాసం. నీవు మాత్రం నా మీద అకారణంగా విరోధం పెంచుకొని నన్ను చంపగోరుతున్నావు. నేను నీకు ఏ ద్రోహం చేయలేదు. దేవుడు మనిద్దరికీ తీర్పు తీర్చునుగాక అన్నాడు. ఆమాటలకు సౌలు మనసు కరిగి పెద్దగా ఏడ్చాడు. నాయనా! నీవు నాకంటె యోగ్యుడివి. నేను నీ చేతికి జిక్కగా నీవు నాకు కీడు చేయక మేలే చేశావు. చేజిక్కిన శత్రువుని ఎవడైన వదలిపెడతాడా? దేవుడు నీకు మేలు చేస్తాడు. నీవు రాజవైనపుడు నా కుటుంబాన్ని నాశం చేయనని ప్రమాణం చేయి అని పల్కి దావీదు చేత ప్రమాణం చేయించుకొన్నాడు. తర్వాత సౌలు తన దారిన తాను వెళ్లిపోయాడు.

58. నిద్రిస్తూన్న సౌలుని వదలివేయడం - 1సమూ 26

దావీదు హకీలా కొండల్లో దాగుకొనివున్నాడు. అతన్ని పట్టుకోవడానికి సౌలు మూడువేలమంది బంటులతో వచ్చాడు. అతడు రాత్రి శిబిరంలో పండుకొని నిద్రపోతున్నాడు. దావీదు అతని దగ్గరికి వచ్చాడు. అతనితో పాటు వచ్చిన అబీషయి సౌలుని చంపుదామన్నాడు. కాని దావీదు దేవుని అభిషిక్తుని చంపడానికి వొప్పకోలేదు. సౌలు ఈటె, నీటికుండ అతని తల ప్రక్కనే వున్నాయి. దావీదు ఆ రెండిటినీ గైకొని గుట్టుచప్పుడు కాకుండ శిబిరం వెలుపలికి వచ్చాడు. అతడు వచ్చిపోయినట్లు అక్కడివారెవరూ గుర్తించలేదు. దావీదు ప్రక్క కొండమీది కెక్కి సౌలునీ అతని సైన్యాధిపతి అబ్నేరుని కేకలువేసి పిల్చాడు. మీ యీటె నీటికుండ ఏమైనవో చూచుకోండి అన్నాడు. రాజుకి సరిగా కాపలా కాయనందుకు