పుట:Pratha Nibandhana Kathalu 2.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కడగొట్టు వాడయిన దావీదుని ఎన్నుకొన్నాడు. ప్రభువు తనకు నచ్చిన వారిని తన సేవకు పిలుస్తాడు.

49. దావీదు గొల్యాతుని జయించడం - 1సమూ 17

యిస్రాయేలీయులు ఫిలిస్టీయులు ఎలా లోయలో యుద్ధానికి తలపడ్డారు. ఫిలిస్టీయుల వీరుడు గొల్యాతు. అతని పొడవు తొమ్మిది అడుగులు. కత్తి, డాలు, ఈటె, బల్లెం మొదలైన ఆయుధాలు ధరించి రాక్షసుక్లాగ వచ్చాడు. అతనితో పోరాడ్డానికి యిప్రాయేలీయుల్లో ఎవరూ సాహసించలేదు. బాలుడైన దావీదు నేను పోరాడతానని ముందుకు వచ్చాడు. సౌలురాజు మొదట అంగీకరింపకపోయినా వేరే వ్యక్తి దొరకనందున దావీదుని అనుమతించాడు. పోరాడేది ఇద్దరు వీరులే. గెల్చిన వీరుని పక్షం వాళ్లు గెల్చినట్లు. గొల్యాతు యుద్ధంలో కాకలు తీరిన యోధుడు. దావీదు పసివాడు. అతని ఆయుధాలు ఒడిసెల, ఐదురాళ్లు మాత్రమే.

గొల్యాతు దావీదుని చిన్నచూపు చూచి నిందించాడు. అతడు ఏ సౌలు లాంటి గొప్ప వీరుడో తనతో పోరాడ్లానికి వస్తాడనుకొన్నాడు. దావీదుని చంపి వన్యమృగాలకు ఆహారంగా వేస్తానని డంబాలు పల్మాడు. దావీదు నీవు ఆయుధాలతోను మానుషబలంతోను వచ్చావు. కాని నేను యావే పేరుమీదిగా వచ్చాను. నాది దైవబలం అని పల్మాడు. ఇద్దరు వీరులు డీకొన్నారు. దావీదు ఒడిసెలను గిరగిరత్రిప్పి రాయి విసిరాడు. అది తిన్నగా దూసుకొని పోయి గొల్యాతు నొసటిని చీల్చి లోపలికి చొచ్చుకొని పోయింది. ఆ రాక్షసుడు మొదలు నరికిన తాటిచెట్టు లాగ గబీలున నేలమీద కూలాడు. అతడు సొమ్మసిల్లి పడిపోయాడే గాని ఇంకా చావలేదు. దావీదు గబగబా గొల్యాతు దేహంమీదికెక్కి అతని కత్తితోనే అతన్ని పొడిచి చంపాడు. అతని శిరస్సును నరుకుకొని వచ్చాడు. తమ వీరుడు ఓడిపోవడం చూచి ఫిలిస్టీయులు పారిపోయారు. యిస్రాయేలు సైనికులు వారిని వెన్నాడి కొల్లసొమ్ము దోచుకొన్నారు. ఈ విజయం దావీదుకి బాగా పేరు తెచ్చిపెట్టింది. ○