పుట:Pratha Nibandhana Kathalu 2.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చి మీది గదిలోనికి పోయి బాలుని మృతదేహంపై బోరగిల పండుకొన్నాడు. అతని నోరు, కన్నులు, చేతులు శవాన్ని తాకాయి. పిల్లవాడి శరీరానికి ఉష్ణం పుట్టింది. వాడు ఏడుసార్లు తుమ్మి మెల్లగా కన్నులు విప్పి చూచాడు. ప్రాణాలు తిరిగి వచ్చిన బిడ్డ ప్రవక్త తల్లికి అప్పగించాడు.

79. నామాను కుష్ట నయంగావడం - 2రాజు 5, 1-19

నామాను సిరియా దేశానికి సైన్యాధిపతి. అతడు ఆ దేశపు రాజుకి చాల విజయాలు చేకూర్చి పెట్టాడు. కనుక రాజుకి అతనిమీద అభిమానం కలిగింది. కాని నామూను కుష్టరోగి. ఒకసారి సిరియనులు యిస్రాయేలు దేశంమీద దండెత్తి వారి బాలికను బందీగా కొనివచ్చి నామాను భార్యకు దాసిగా యిచ్చారు. ఆ పిల్ల మన దొర యిప్రాయేలు దేశానికి వెళ్లే అక్కడి ప్రవక్త కుష్ట నయం చేస్తాడని యజమానురాలితో చెప్పింది. ఆ సంగతి నామాను రాజుకి తెలియజేయగా అతడు సైన్యాధిపతిని సిఫార్సు చేస్తూ యిస్రాయేలు రాజుకి జాబు వ్రాసి యిచ్చాడు. నామాను ఆ లేఖతో, కానుకలతో యిస్రాయేలు రాజు వద్దకు వచ్చాడు. రాజు ఆ జాబు చదివి ఇతని కుష్ట నేనేలా నయం జేయగలనని చిరాకు తెచ్చుకొన్నాడు. ఆ సంగతి విని ఎలీషా సైన్యాధిపతిని తన దగ్గరికి పంప మన్నాడు. కాని అతడు వచ్చినప్పుడు ఎలీషా ఎదురు వచ్చి అతన్ని ఆహ్వానించలేదు. సేవకుణ్ణి పంపించి నీవు వెళ్లి ఏడుసార్లు యోర్గాను నదిలో స్నానం చేయి అని చెప్పించాడు. నామాను అది అమార్యదగా భావించి కోపించి తన దేశానికి తిరిగి పొగోరాడు. కాని సేవకులు అతన్ని బతిమాలి యోర్గానులో స్నానం చేయించారు. వెంటనే కుష్ట నయమై ఆరోగ్యం చేకూరింది. నామాను తిరిగి వచ్చి కృతజ్ఞతా పూర్వకంగా కానుకలు అర్పించ బోయాడు గాని ప్రవక్త వాటిని స్వీకరించలేదు. సైన్యాధిపతి ఇక మీదట నేను యావే ప్రభువుని మాత్రమే ఆరాధిస్తానని మాట యిచ్చి తన దేశానికి పయనమయ్యాడు.

80. గేహసీ దురాశ - 2 రాజు 5,20-27

గేహసి యెలీషా శిష్యుడు. ప్రవక్తగా తర్ఫీదు పొందుతున్నాడు. అతడు