పుట:Pratha Nibandhana Kathalu 2.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉడికే పులుసులో కలిపాడు. తర్వాత ప్రవక్తలు పులుసును త్రాగబోగా దానికి విషమెక్కింది. ఏలీషా కొంచెం పిండిని తెప్పించి పులుసులో కలిపాడు. వెంటనే విషం విరిగిపోగా అతిథులు పులుసు త్రాగారు. అది వారికి ఏ హాని చేయలేదు.

77. రొట్టెలు పెరగడం - 2రాజు 4,42-44

ఒక భక్తుడు ఏలీషాకు ఇరవై యవధాన్యపు రొట్టెలూ, ధాన్యం వెన్నులూ తీసికొని వచ్చాడు. ప్రవక్త సేవకుణ్ణి పిల్చి వాటిని మన యింటికి వచ్చిన ప్రవక్తలకు పంచి పెట్టమని చెప్పాడు. కాని వాళ్లు వందమంది వున్నారు. కనుక సేవకుడు ఇంతమందికి యివి ఏలా సరిపోతాయి అని అడిగాడు. ఏలీషా పర్వాలేదు. అతిథులు తిన్నాక ఇంకా కొన్ని మిగులుతాయి అని చెప్పాడు. శిష్యుడు రొట్టెలను పంచగా అందరూ తృప్తిగా భుజించారు. పిమ్మట ఇంకా కొన్ని మిగిలాయి. ప్రవక్త వాక్కులోని శక్తి ఆలాంటిది.

78. షూనేము స్త్రీ కుమారుణ్ణి బ్రతికించడం - 2రాజు 4,8–37

ఎలీషా షూనేము నగరానికి వెళ్లాడు. అక్కడ ఓ సంపన్నురాలు అతనికి ఆతిధ్యమిచ్చింది. ఆమె యింటిమీద ఓ గది కట్టించి దానితో పడక కుర్చీ బల్ల, దీపం మొదలైన సామానులు అమర్చింది. ఎలీషా ఆ వూరు వెళ్లినప్పడెల్ల ఆ గదిలోనే బస చేసేవాడు. ఆమెకు సంతానం లేదు. తనకు చేసిన ఉపకారానికి బదులుగా, ప్రవక్త ఆమెకు ఒక యేడాదిలోనే సంతానం కలుగుతుందని దీవించాడు. తర్వాత అతడు చెప్పినట్లే బిడ్డడు పుట్టాడు. కాని ఒకనాడు ఆ పిల్లవాడు జబ్బుచేసి చనిపోయాడు. తల్లి వాణ్ణి యేలీషా గదిలోని పడక మీద పరుండబెట్టి గబగబా కర్మెలు కొండమీద వసించే యేలీషా దగ్గరికి వెళ్లింది. నీవు నా కుమారుణ్ణి బ్రతికించాలని వేడుకొంది. ప్రవక్త మొదట తన శిష్యుడు గేహసీని పంపగా అతడు గురువుగారి కర్రను కొనిపోయి బాలుని మృతదేహంపై చాపాడు. ఐనా బిడ్డడికి ప్రాణం రాలేదు. తర్వాత ఎలీషా