పుట:Pratha Nibandhana Kathalu 2.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దానినెక్కి సుడిగాలిలో స్వర్గానికి వెళ్లిపోయాడు. ఏలీషా అదృశ్యాన్ని చూచాడు. గురువు వెళ్లిపోయినందుకు ఎంతో చింతించాడు. అతడు ఏలీయా జారవిడచిన అంగీతో నదినీళ్లను బాదగా అవి విడిపోయి దారి యేర్పడింది. ఆ దారిన ఈవలి వొడ్డుకి నడచివచ్చాడు. ఈ యద్భుతం ద్వారా ఏలీయా శక్తి అతనికి సంక్రమించిందని రుజువైంది.

74. అల్లరి పిల్లలకు శిక్ష - 2రాజు 2,23-25

ఎలీషా బేతేలుకు వెళ్తుండగా దారిలో కొందరు అల్లరిపిల్లలు ప్రోగై అతని వెంటబడి పోపో బట్ట తలకాయా అని ఎగతాళి చేశారు. అతడు కోపంతో వారిని శపించాడు. వెంటనే అడవిలోనుండి రెండు ఎలుగుబంట్లు వచ్చి నలభై యిద్దరు పిల్లలను చంపివేశాయి. పెద్దలను అవమానించ కూడదని ఈ సంఘటనం భావం.

75. ఎలీషా పేద విధవకు సహాయం చేయడం - 2రాజు 4,1-7

ఒక ప్రవక్త బాకీ చేసి చనిపోయాడు. ఋణదాతవచ్చి అతని యిద్దరు కుమారులను బానిసలుగా తీసికొని పోతానని బెదిరించాడు. విధవయైన తల్లి వచ్చి యేలీషా వద్ద మొరపెట్టుకొంది. ఆమె యింటిలో కూజాలో ఓలివు నూనెమాత్రం వుంది. ప్రవక్త ఆమెతో మీ యిరుగు పొరుగు వారి యిండ్లనుండి ఖాళీ కూజాలు ప్రోగు జేసికొని వచ్చి మీ కూజాలోని ఓలీవు నూనెను వాటిలో పోయమని చెప్పాడు. ఆమె ప్రవక్త మాటలు విశ్వసించి అతడు చెప్పినట్లే చేసింది. చమురు పోస్తుండగా ఆ కూజాలన్నీ నిండిపో యాయి. చివరి కూజా నిండాక సొంత కూజాలోని చమురు పొర్లడం ఆగిపోయింది. ప్రవక్త సలహాపై ఆమె ఆ చమురు అమ్మి బాకీ తీర్చింది. మిగిలిన సొమ్ముతో తానూ యిద్దరు కుమారులూ జీవిత యాత్ర గడిపారు.

76. విషమెక్కిన పులుసు - 2రాజు 4,38-41

ఎలీషా గిల్లాలులో ప్రవక్తలకు బోధ చేస్తున్నాడు. సేవకుణ్ణి పిల్చి ప్రవక్తలకు పులుసు తయారు చేయమని చెప్పాడు. ఒక ప్రవక్త పొలానికి పోయి తెలియక ఏవో పిచ్చి కాయలు కోసుకుని వచ్చి ముక్కలుగా తరిగి