పుట:Pratha Nibandhana Kathalu 2.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురువు నామాను కానుకలను తిరస్కరించడం చూచాడు. దురాశతో తాను వాటిని దక్కించుకోవాలనుకొన్నాడు. నామాను వెంట పరుగెత్తి అయ్యా! మా గురువుగారి దగ్గరకి ఇప్పడే యిద్దరు ప్రవక్తలు అతిథులుగా వచ్చారు. వారికి ఈయడానికి గురువుగారు మూడు వేల వెండి నాణాలు, రెండు జతల పట్టుబట్టలు ఈయవలసిందిగా నిన్ను అర్ధిస్తున్నారు అని బొంకాడు. నామూను ఉదారంగా అతడు అడిగిన దానికి రెండంతలు అదనంగా యిచ్చాడు. గేహసీ ఆ కానుకలను తన యింటిలో దాచిపెట్టి ఏమి యెరగనట్లుగా గురువు దగ్గరికి వెళ్లాడు. ఎలీషా ఓయి!నీవు ఎక్కడికి వెళ్లావని ప్రశ్నించాడు. అతడు నేనెక్కడికి వెళ్లలేదని మళ్లా రెండవసారి బొంకాడు. ప్రవక్త కోపించి నా మనసు నీతో వచ్చి నీవు చేసిన మోసమంతా చూచింది. నీవు ఆస్తులు సంపాదించాలనుకొన్నావు. నామానుకి సోకిన కుష్టతరతరాల దాక నిన్ను నీ వంశీయులను పట్టిపీడిస్తుందిపో అన్నాడు. గేహసీకి వెంటనే కుష్ట సోకింది. ఇక అతడు తన వంశీయులకు ఆస్తులను గాక కుష్ట రోగాన్ని వారసంగా యిస్తాడు.