పుట:Pratha Nibandhana Kathalu 2.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వివేక వరాన్ని అడిగావు. నీ కోర్కెను తప్పక తీరుస్తాను. ఏ రాజుకీ దక్కని సిరిసంపదలూ, కీర్తి ప్రతిష్ఠలూ నీ కిస్తాను. నీ తండ్రిలాగే నీవుకూడ నాయాజ్ఞలు పాటించావంటే నీకు దీర్గాయువు కూడ లభిస్తుంది అని చెప్పాడు. తర్వాత సొలోమోను యెరూషలేములో కూడ బలి సమర్పించి తన కొలువు వారికి విందు చేశాడు.

63. సొలోమోను స్త్రీల తగవు తీర్చడం -1రాజు 3

దేవుడిచ్చిన వివేకవరం సొలోమోను మీద పనిచేసింది. ఒకే యింటిలో వసిస్తున్నయిద్దరు వేశ్యలు ఒకే పర్యాయం మగబిడ్డలను కన్నారు. వారిలో ఒక బిడ్డడు చనిపోయాడు. చనిపోయిన బిడ్డడి తల్లి తన శిశువుని తెచ్చి రెండవ తల్లి ప్రక్కలో పండబెట్టి బ్రతికివున్న శిశువుని కొనిపోయి తన ప్రక్కలో పండబెట్టుకొంది. తర్వాత నిజమైన తల్లి ఆ మోసాన్ని గుర్తించింది. వాళ్లిద్దరూ బ్రతికివున్నవాడు నా బిడ్డడంటే నా బిడ్డడని తగాదా ఆడుకొని రాజు దగ్గరికి వచ్చి తీర్పు తీర్చమన్నారు. సొలోమోను కొంచెం ఆలోచించి బంటును పిలచి శిశువుని రెండు ముక్కలుగా నరికి చెరొక ముక్క ఈయమన్నాడు. నిజమైన తల్లి దేవరా! నా బిడ్డడు ఎక్కడ బ్రతికి వున్నా చాలు. వాణ్ణి చంపవద్దు. ఆమెకే యిప్పంచండి అంది. రెండవ ఆమె అసూయతో ఈ పాపడు ఎవరికీ దక్కకూడదు. వీణ్ణి రెండుగా నరక వలసిందే అంది. రాజు నిజమైన తల్లి మొదటి ఆమె అని తీర్పు చెప్పాడు. నగరంలోని ప్రజలు రాజు చెప్పిన తీర్పు విన్నారు. వాళ్లు సొలోమోనుకి అతని తండ్రికున్నంత అనుభవం వుందా అని శంకిస్తున్నారు. ఈ తీర్పును విన్నతర్వాత రాజుని మెచ్చుకొని అతనికి విధేయులయ్యారు.

64. దేవాలయ నిర్మాణం - 1 రాజు 5

సొలోమోను సాధించిన గొప్ప కార్యం యెరూషలేము దేవాలయ నిర్మాణం. మొదట దావీదే దేవళాన్ని కట్టాలని సంకల్పించుకొన్నాడు. స్థలాన్ని కొని వెండిబంగారాలు ప్రోగుజేశాడు. కాని దేవుడు నీ కుమారుడు ఆ పని చేస్తాడు అని చెప్పగా ఆగిపోయాడు. సొలోమోను తూరు రాజైన