పుట:Pratha Nibandhana Kathalu 2.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిరాముతో పొత్తు కుదుర్చుకొన్నాడు. ఆ రాజు దేవదారులు, సరళ వృక్షాలు నరకించి సొలోమోనుకి పంపాడు. సొలోమోను పనివాళ్లు రాళ్లు పగలగొట్టారు. ఇంచుమించు రెండు లక్షలమంది పనివాళ్లు ఏడేండ్లు శ్రమించి మందిరాన్ని కట్టి ముగించారు. సొలోమోను తన పరిపాలనా కాలం నాల్గవయేట మందిర నిర్మాణం ప్రారంభించి, పదకొండవ యేట ముగించాడు. దేవాలయం తర్వాత రాజప్రాసాదం కూడ నిర్మించాడు. ఆ రోజుల్లో సొలోమోను దేవాలయం అద్భుతమైన కట్టడం. దేశదేశాల నుండి యాత్రికులు దాన్ని సందర్శించడానికి వచ్చేవాళ్లు.

దేవాలయ నిర్మాణం ముగిసాక రాజు మందసాన్ని తెప్పించి దేవాలయంలో ప్రతిష్ఠింప జేశాడు. దైవసాన్నిధ్యం దేవళంలో నెలకొంది. ప్రజలు పెద్ద గుంపుగా ప్రోగయ్యారు. రాజు పీఠానికి ఎదురుగా నిల్చుండి చేతులు పైకెత్తి యిస్రాయేలు ప్రభువువైన దేవా! పై ఆకాశంలో గాని క్రింది పాతాళంలోగాని నీలాంటి దేవుడు లేడు. నీవు మమ్మ కరుణించు అని ప్రార్థించాడు -8,23.

65. షెబారాణి రాజును సందర్శించడం - 1రాజు 10

షెబారాణి సొలోమోను గొప్పతనాన్ని గూర్చి విని అతన్ని సందర్శించడానికి ఆఫ్రికా దేశంనుండి వచ్చింది. ఆమె యెన్నో చిక్కుప్రశ్నలు వేయగా అతడు అన్నిటికి జవాబు చెప్పాడు. రాణి అతడు నిర్మించిన భవనాలనూ, అతని సేవకులనూ, అతని జ్ఞానాన్నీ చూచి విస్తుపోయింది. నేను నిన్ను గూర్చి వినిన దానికంటె నీవు అధికుడవు అని మెచ్చుకొంది. అతనికి బంగారం రత్నాలు, సుగంధ ద్రవ్యాలు కానుకకగా యిచ్చింది. రాజుకూడ ఆమెకు నానా వస్తువులు బహూకరించాడు.

66. సొలోమోను విగ్రహారాధనం - 1 రాజు 11

ప్రభువు సొలోమోనుకి సంపదలూ, అధికారం, విజ్ఞానం అన్నీ యిచ్చాడు. ఐనా ఆరాజు పడిపోయాడు. ఆ రాజు తన అధికారాన్ని కాపాడుకోడానికి చాలమంది అన్యజాతి రాజపుత్రికలను పెండ్లాడాడు. వాళ్లు అన్యదైవాలను కొల్చేస్త్రీలు.కనుక వాళ్లు సొలోమోను హృదయాన్ని