పుట:Pratha Nibandhana Kathalu 2.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాటివాణ్ణి? చచ్చిన కుక్క లాంటి వాణ్ణికదా! నీవు ఈ దాసుని పట్ల ఎంత దయజూపావు అని దావీదుకి దండం పెట్టాడు. రాజు సీబా అనే సేవకుణ్ణి సౌలు పొలం సాగుజేసి ధాన్యాన్ని మెపీబోషెతు కుటుంబానికి ఈయ వలసిందగా ఆజ్ఞాపించాడు. ఆ అవిటివాడు మాత్రం జీవితాంతం రాజ భవనంలోనే భోజనంచేశాడు.

61. అబ్వాలోము చావు -2సమూ 18,9-17

అబ్బాలోము తండ్రిమీద తిరగబడి విప్లవం లేవదీశాడు. అతని సైన్యానికీ దావీదు సైన్యానికీ అడవిలో యుద్ధం జరిగింది. అతని సైన్యం ఓడిపోయింది. అబ్వాలోముకి పెద్ద జట్టు వుంది. అతడు గాడిదనెక్కి సిందూరపు చెట్టు క్రిందిగా పోతుండగా జుట్టు గజిబిజిగా ఎదిగివున్న ఆ చెట్టు కొమ్మల్లో చిక్కుకొంది. గాడిద అతన్ని విడిచి వెళ్లిపోయింది. అతడు చెట్టుకొమ్మల్లో వేలాడుతున్నాడు. యోవాబుకి ఈ సంగతి తెలిసింది. అతడు వెంటనే పోయి బల్లెం తీసికొని అబ్బాలోము గుండెలో పొడిచాడు. అతని అంగరక్షకుడు శత్రువు మీదపడి అతన్ని చంపివేశాడు. కుమారుడు చనిపోయినందుకు రాజు మిగుల దుఃఖించాడు. నాయనా! నీకు బదులుగా నేనే చనిపోయినట్లయితే బాగుండేది కదా అని యేడ్చాడు. యోవాబు అతన్ని ఓదార్చాడు. తర్వాత దావీదు మరల రాజుగా పరిపాలనం చేశాడు.

62. సొలోమోను కల - 1 రాజు 3

దావీదు తర్వాత సొలోమోను రాజయ్యాడు. అతడు మొదట దావీదు మార్గాల్లోనే నడచి యావే ప్రభువుని భక్తితో సేవించాడు. ఒకసారి గిబ్యోను పుణ్యక్షేత్రానికి వెళ్లి దేవునికి బలి సమర్పించాడు. ఆ రాత్రి దేవుడు కలలో కన్పించి నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. సొలోమోను ప్రభూ! నేను చిన్నవాడను. మా తండ్రి కున్న అనుభవం నాకు లేదు. ఇప్పడు నీ దయ వల్ల నేను రాజునయ్యాను. కనుక ఈ ప్రజలను పాలించడానికి కావలసిన వివేకాన్ని నాకు ప్రసాదించు అని వేడుకొన్నాడు. దేవుడు రాజుని మెచ్చుకొని నీవు దీర్గాయువు, సరిసంపదలు, శత్రునాశం మొదలైన వరాలు కోరుకోలేదు. ప్రజల మేలెంచి వారిని న్యాయసమ్మతంగా పరిపాలించడానికి