పుట:Pratha Nibandhana Kathalu 2.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అబ్బేరుని గేలి చేశాడు. నేను నీ ప్రాణాలు తీయగలిగి కూడ తీయలేదు. నీవు నిరపరాధినైన నన్ను కౌజు పక్షినిలాగ తరుముకొనివచ్చావు కదా అని సౌలుని హెచ్చరించాడు. ఆ మాటలకు సౌలు సిగ్గుపడి పశ్చాత్తాపం చెందాడు. ఇక మీదట దావీదుకి ఎట్టి కీడు తలపెట్టనని మాట యిచ్చాడు. అతని సేవకుడు వెళ్లి ఈటెనుగా నీటికుండనూ తీసికొని వచ్చాడు. ఆ పిమ్మట సౌలు వెళ్లిపోయాడు.

54. సౌలు మరణం - 1సమూ 31

గిల్బోవా కొండమీద సౌలుకీ ఫిలిస్టీయులకీ యుద్ధం ευθfιού. శత్రువులు సౌలు మీద బాణాలు గుప్పించగా అతడు బాగా గాయపడి నేలకొరిగాడు. అతడు తన అంగరక్షకుని బిలచి నీ కత్తితో నన్ను చంపు. లేకపోతే ఈ ఫిలిస్టీయులు నామీద బడి నన్ను అవమానిస్తారు అని చెప్పాడు. కాని అంగరక్షకుడు అతన్ని చంపడానికి భయపడ్డాడు. సౌలు తానే తన కత్తి మీదబడి ప్రాణాలు విడిచాడు. అంగరక్షకుడు కూడ ఆలాగే సొంత కత్తిమీద బడి ప్రాణాలు కోల్పోయాడు. యుద్ధంలో సౌలు ముగురు కుమారులు కూడ చనిపోయారు. ఫిలిస్టీయులు వచ్చి సౌలు తలను నరికి ఎత్తుకొనిపోయారు.

55. దావీదు యెరూషలేమును జయించడం - 2సమూ5, 6-10

సౌలు తర్వాత దావీదు రాజయ్యాడు. అతడు హెబ్రోనును రాజధానిగా జేసికొని కొంతకాలం పరిపాలించాడు. కాని అతనికి పెద్ద రాజధాని నగరం అవసరమైంది. ఆ రోజుల్లో యెరూషలేము యొబూసీయుల అధీనంలో వుండేది. దావీదు సైనికులు ఆ నగరాన్ని ముట్టడించారు. అక్కడి ప్రజలు మీకీ పట్టణం చిక్కదు. ఇది సురక్షిత నగరం. కుంటివాళ్లు, గ్రుడ్డివాళ్లు కూడ దీనిని కాపాడగలరు అని పల్మారు. ఆ పట్టణానికి నీళ్లుపారే సొరంగం ఒకటుంది. దావీదు సైనికులు రహస్యంగా ఆ సొరంగం గుండా పోయి పట్టణంలో ప్రవేశించి దాన్ని వశం జేసికొన్నారు. దావీదు దానికి దావీదు