పుట:Pratha Nibandhana Kathalu 2.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నగరం అని పేరుపెట్టి చుటూ ప్రాకారం కట్టించి సురక్షితం జేశాడు. అప్పటి నుండి అది యూదులకు రాజధాని నగరమైంది.

56. మందసాన్ని యెరూషలేముకి కొనిరావడం - 2సమూ 6, 12-22

ప్రభువు మోషేకు వ్రాసియిచ్చిన పదియాజ్ఞల రాతిపలకలను ఓ మందసంలో వుంచారు. యూదులకు ఆ పెట్టే దైవసాన్నిధ్యం. దావీదు భక్తి భావంతో ఆ పెట్టెకు యెరూషలేములో ఓ గుడారం సిద్ధం జేసాడు దాన్ని యెరూషలేముకి కొనివచ్చాడు. మందసాన్ని యాజకులు మోసికొని వచ్చారు. దాని ముందు భక్తులు వాద్యాలు మీటుతూ పాటలు పాడారు. జంతుబలులు సమర్పించారు. దావీదు యాజకులు ధరించే నారబట్టలు తాల్చి మందసం ముందు తన్మయత్వంతో నాట్యం చేశాడు. పెట్టెను నగరంలోని గుడారంలో ప్రతిష్టించారు. రాజు అక్కడ దహనబలులు సమాధాన బలులు సమర్పించాడు. అందరికీ రొట్టెలూ పండూ పంచిపెట్టాడు. సౌలు కూతురు మీకాలు దావీదు భార్య. ఆమె నీవు కోణంగిలాగ మందసం ముందు నాట్యం జేశావు గదా అని దావీదుని దెప్పిపొడిచింది. అతడు ప్రభువు నీ తండ్రిని కాదని నన్ను ప్రజలకు రాజుని జేశాడుగదా అని ఆమెకు సమాధానం చెప్పాడు. ఆ రాజు యావేపట్ల అపారమైన భక్తి కలవాడు. ఆ ప్రభువుని స్తుతిస్తూ చాల కీర్తనలు కూడ వ్రాశాడు.

57. బత్తెబా ఉదంతం - 2సమూ 11

దావీదు సైన్యాధిపతి యోవాబు రబ్బా పట్టణంలో అమ్మోనీయులతో యుద్ధం జేస్తున్నాడు. ఒకరోజు మాపటివేళ దావీదు రాజభవనం మీద పచార్లు చేస్తూ ప్రక్కింటి ఆడగూతురు బత్తెబా స్నానం చేసికొంటూండగా గమనించాడు. ఆమె కంట బడగానే దావీదుకి మతి చలించింది. ఆమె దావీదు సైనికుల్లో ఒకడైన ఊరియా భార్య. అతడు రబ్బా నగరంలో యుద్ధం జేస్తున్నాడు. దావీదు సేవకులను పంపి బత్తెబ్రను తన మేడకు రప్పించుకొని ఆమెను కూడాడు. ఆమె గర్భవతి ఐంది. బత్తెబ పెనిమిటి వల్లనే