పుట:Prasarapramukulu022372mbp.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసార ప్రముఖులు.

33

ప్రాంతాలలో పనిచేశారు. శ్రీనగర్ రేడియో కేంద్ర డైరక్టర్ గా 1994లో నియుక్తులయ్యారు. ఉర్దూలోను, ఆంగ్లంలోను చక్కటి ప్రవేశం ఉంది. వీరు 1996 నవంబరులో హైదరాబాదు కేంద్రం డైరక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

P. గోవర్ధన్ :

1940 మార్చి 9న జన్మించారు. ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా 1963లో ఆకాశవాణిలో చేరారు. 1986లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్ అయ్యారు. ప్రొగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా మదరాసు, హైదరాబాదు, గ్యాంగ్‌టాక్‌లలో పనిచేశారు. కొత్తగూడెం కేంద్రంలో, కర్నూలు కేంద్రంలో ASDగా పనిచేశారు. 1998 లో డైరక్టర్‌గా ప్రమోట్ అయి కర్నూలులోనే పనిచేశారు. 1995లో హైదరాబాద్ వివిధ భారతి కేంద్ర డైరక్టర్ గా పదవీబాధ్యతలు స్వీకరించారు.

శంకరమంచి సత్యం :

S. సత్యనారాయణరావు గుంటూరుజిల్ల అమరావతిలో జన్మించారు. బి. ఏ. బి. యల్, పట్టాపుచ్చుకొన్నారు. ఆకాశవాణిలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా విజయవాడలో పనిచేశారు. అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్ గా 1978లో బొంబాయి వెళ్ళారు. అక్కడ నుండి డైరక్టర్‌గా రాజస్థాన్‌లోని ఉదయపూర్ లో నాలుగేళ్ళు పనిచేశారు. 1988 లో ఢిల్లీలోని విదేశీ ప్రసార విభాగంలో చేరారు. అదే సంవత్సరం అనారోగ్యంతో ఆయన ఢిల్లీలో మరణించారు. సత్యం శంకరమంచి "అమరావతి కథలు" కథాసంపుటి బహుళజనామోదం పొందింది. ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహికగా వెలువడి కేంద్రసాహిత్య అకాడమీ బహుమతిపొందింది. ఢిల్లీ దూరదర్శన్ నేషనల్ ఛానల్‌లో ఆ కథలు ప్రసారమయ్యాయి. అమరావతి పరిసరాల వాతావరణాన్ని ఆయన చక్కగా శబ్దచిత్రంలో చూపారు. ఆయన విజయవాడ నుండి ప్రసారం చేసిన హరోంహరహర ఇతర నాటకాలు శ్రోతల మన్ననలు పొందాయి.