పుట:Prasarapramukulu022372mbp.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

ప్రసార ప్రముఖులు.

ప్రభుత్వ మహిళా సంక్షేమశాఖలో ఒక దశాబ్దానికిపైగా పని చేశారు. 75 నుండి 91 వరకు జానకీరాణి ప్రొడ్యూసర్ గా పని చేశారు. 91 92లో అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరుగా పదోన్నతి పొందారు. జానకీరాణి రూపొందించిన రూపకం 89లో జాతీయస్థాయిలో బహుమతి పొందింది. నవలా రచయత , కథా రచయత రూపక రచయత అయిన జానకీరాణి గృహలక్ష్మి ‘స్వర్ణ’ కంకణ బహూకృతిగా పొందారు. అనేక విశిష్ట సన్మానాలు స్వీకరించారు.

డైరెక్టర్లుగా పని చేసిన కొందరి జీవిత రేఖలు

సి.రాజగోపాల్:

1941 జూన్ 3న జన్మించారు. M A:B.L; పట్టా పొందారు. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా హైదరాబాదు లో చేరారు. ASDగా 1982లో UPSC ద్వారా నియుక్తులై అదిలాబాదు, విశాఖపట్టణాలలో పనిచేసారు. 1987లో డైరెక్టరుగా మంగళూరు కేంద్రంలో పని చేసి అక్కడ నుండి నాలుగేళ్ళు ధార్వాడలో డైరెక్టరుగా వ్యవహరించారు. 1992లో బొంబాయిలోని Central Sales యూనిట్ డైరెక్టరుగా పదవీ భాధ్యతలు స్వీకరించారు.

M.N. రావు:

నిత్యానందరావుగారు ఏలూరు వాస్తవ్యులు. 1936 జూన్ 18న జన్మించారు. M.A ఎకనామిక్స్ లో పట్టా పొంది ప్రభుత్వకళాశాలల్లో లెక్చరర్ గా పనిచేసారు. 1983లో UPSC ద్వారా అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరుగా నేరుగా త్రివేండ్రంలో చేరారు. అక్కడ నుండి 1984 లో హైదరాబాదు కేంద్రానికి బదిలీ అయ్యారు. డైరెక్టరుగా నిజామాబాదు కేంద్రంలో పనిచేసి 1994 జూన్ లో పదవీ విరమణ చేసారు.

కబీర్ అహమ్మద్ :

కబీర్ అహమ్మద్ హైదరాబాదులో 1940 జులై 30న జన్మించారు. ఎం.ఏ పట్టబద్రులు. 1967లో జాతీయస్థాయిలో జరిగిన పోటీలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్ లిస్టులో దేశంలో మొట్టమొదటి స్థానం సంపాదించారు. ఆ తరువాత ప్రొడ్యూసర్ గా దూరదర్శన్ లో పనిచేశారు. 1982 లో అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. కొత్తగూడెం, CBS హైదరాబాదు తదితర