పుట:Prasarapramukulu022372mbp.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

ప్రసార ప్రముఖులు.

1953లో ఆంధ్రరాష్ట్రావతరణ తరువాత రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టరుగా వ్యవహరించారు. 1957లో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో గ్రామస్థుల కార్యక్రమాల ప్రయోక్తగా పని చేసారు. వీరి హయాంలో చక్కటి ప్రయోజనాత్మక కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. అనేక రేడియో నాటికలు వ్రాశారు. రేడియో ప్రసంగాలన్నీ ఉభయకుశలోపరి పేర ప్రచురించారు. గోపీచంద్ సినీ జీవితం పేర్కొనదగింది. 1939లో గృహలక్ష్మి చిత్రంతో ఆరంభమైంది వీరి సినీ జీవితం. చదువుకున్న అమ్మాయిలు, రైతు బిడ్డ చిత్రాలకు మాటలు వ్రాశారు. లక్ష్మమ్మ, పేరంటాలు, ప్రియురాలు చిత్ర దర్శకత్వం చేపట్టారు.

దేవుని జీవితం, తండ్రులు-కొడుకులు , పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, ధర్మాసుపత్రి , అసమర్ధుని జీవయాత్ర , పరివర్తన, శిధిలాలయం - వీరి నవలలో ప్రధానాలు. భార్యల్లోనే వుంది, దేశం ఎమయ్యేట్టు , గీతా పారాయణం ,సరే కానివ్వండి వీరి యితర రచనలు. పట్టభిగారి సోషలిజం , మర్క్సిజం అంటే ఏమిటి? సోషలిస్టు ఉద్యమం చరిత్ర - వీరి విమర్శనా పటిమకు నిదర్సన గ్రంధాలు. తత్వశాస్త్రం, తత్వవేత్తలు, పోస్టు చెయ్యని ఉత్తరాలు - తత్వ పరిశోధనా గ్రంధాలు.

గోపీచంద్ గుండెపోటుతో 1962 నవంబరు 22న మరణించారు. గోపీచంద్ కుమారులు సైచాండ్ టీవి నటుడిగా ప్రసిద్దిపొందారు. గోపీచంద్ తండ్రి త్రిపురనేని రామస్వామి చౌదరి గొప్ప కవి, సంఘసంస్కర్త . కుమారునిపై తండ్రి ప్రభావం ఎంతో వుంది.

పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనీ నవలకు కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం లభించింది. మెరుపుల మరకలు , చీకటి నవలలు యితర నవలలు, మాంచాల, పస్చిమవాహిని, గుడ్డి సంఘం , అభాగివి, తత్వమసి వీరి నాటక రచనలు. మాలపల్లి నవలకు నాటకీకరణ చేసారు.

నాయని సుబ్బారావు (1899 - 1978)

1899 అక్టోబరు 29న నాయనివారు (అప్పటి నెల్లూరు జిల్లా పొదిలిలో జన్మించారు. నవ్యాంధ్ర కవులలో ఆయన అగ్రగణ్యుడు. ఈ శతాబ్ది ఆరంభంలో రెండు,మూడు దశాబ్దులలో ప్రణయ కవిత్వానికి పట్టం కట్టినవారిలో నాయని ఒకరు. రాయప్రోలు, విశ్వనాథ ,దేవులపల్లివలె వీరు కూడా ప్రేమగీతాలు ఆలపించారు.