పుట:Prasarapramukulu022372mbp.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసార ప్రముఖులు.

15

వీరి సౌభద్రుని ప్రణయయాత్ర సుప్రసిద్ధం. తానే అర్జునుడు . తాను ప్రేమించిన మేనకోడలు సుభద్ర సరస మధుర కావ్యమిది.

ఫలశ్రుతి, నిత్యక్రీడ మొదలైన ఖండికలు విశిష్టాలు. నాయని వారి మాతృ గీతాలు బాగా ప్రచారం పొందాయి. సుబ్బారావుగారు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ఐదు సంవత్సరాల విద్యాప్రసారాల విభాగం ప్రొడ్యూసరుగా వ్యవహరించారు. 1924లో సహాయ నిరాకరణోద్యమంలోచదువు మానివేశారు. బి.ఏ , బి.ఇ.డి పూర్తి చేసి నరసారావు పేట పురపాలక ఉన్నత పాఠశాలలో టీచర్ గా పని చేసారు.

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగా తొలినాళ్ళలో పని చేసారు. భాగ్యనగర కోకిల , వేదనా వాసుదేవం, విషాద మోహనం, ఫలశ్రుతి, మాతృగీతాలు వీరి రచనలు. 1961లో అఖిలాంధ్ర రచయతల సంఘం వీరిని ఘనంగా సత్కరించింది.

నాయని సుబ్బారావు 9-7-78న గతించారు. వీరి కుమార్తెలు ఆచార్య నాయని కృష్ణకుమారి , కోటీశ్వరి. కృష్ణకుమారిగారు తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మూడు దశాబ్దాలు అధ్యాపకులుగా వ్యవహరించారు. జన్మభూమి, వేదనా వాసుదేవము, విషాద మోహనము వీరి రచనలు. భాగ్యనగర కోకిల సుబ్బారావు 1958-64 సం॥ల మధ్య వ్రాసిన రచన ఆయన ఉదాత్తకవి. ప్రాపంచిక కామ్యాల పట్ల తగులం పెట్టుకోలేదు నాయని వారు. కులపొలికా ప్రణయాన్ని సాహిత్యంలో ప్రవేశపెట్టిన కవితా మార్గదర్శి నాయని. జన్మభూమి వంటి కావ్యాన్ని ఒక భక్తుడు, జ్ఞాని యోగి మాత్రమే రచింపగలరని చెప్పవచ్చు. అందుకే నాయని వ్రాసినదంతా సువర్ణమే నన్నాడు దేవులపల్లి కృష్ణ శాస్త్రి.

స్థానం నరసింహారావు (1902-71)

ఆంధ్ర నాటకరంగ చరిత్రలో నరసింహారావు స్థానం చిరస్థాయిగా నిలిచి పోతుంది. ఆయన స్త్రీ పాత్రదారణలో అసాధారణ ప్రజ్ఞ చూపించారు. స్త్రీ పాత్ర అత్యంత సహజంగా, సొగసుగా నటించి ప్రేశాకుల ఆదరాభిమానాలు చూరగొన్నారు. 1902 సం॥ సెప్టెంబరు 23న గుంటూరు జిల్లా బాపట్లలో నరసింహారావు జన్మించారు.